బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - May 05, 2020 , 19:37:54

కరోనాకు యాంటీబాడీని సాధించిన ఇజ్రేల్

కరోనాకు యాంటీబాడీని సాధించిన ఇజ్రేల్

హైదరాబాద్: కరోనా చికిత్సలో గణనీయమైన ముందంజ సాధించినట్టు ఇజ్రేల్ ప్రకటించింది. వైరస్‌కు యాంటీబాడీని అభివృద్ధి చేసే ప్రక్రియలో జీవశాస్త్ర పరిశోధనా సంస్థ విజయం సాధించినట్టు రక్షణమంత్రి నఫ్తాలీ బెనెట్ ఒక ప్రకటనలో  తెలిపారు. పేటెంట్ సాధించడం, భారీస్థాయిలో ఉత్పత్తి చేపట్టడం మాత్రమే మిగిలుందని ఆయన వివరించారు. ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో పనిచేసే ఇజ్రేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ రిసెర్చ్ (ఐఐబీఆర్)ను ఆయన సోమవారం సందర్శించారు. నెస్ జియోనాలోని ఆ పరిశోధనాలయంలో శాస్త్రవేత్తలు ఆయనకు మోనోక్లోనల్ విధానంలో వైరస్‌ను నిర్వీర్యం చేసే ప్రక్రియను ప్రదర్శించారు. యాంటీబాడీల అభివృద్ధి పూర్తయిందని, సంస్థ కృషిని చూసి తాను గర్విస్తున్నానని రక్షణమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే గత మార్చిలో ఓ ఇజ్రేలీ దినపత్రిక యాంటీబాడీ అభివృద్ధి గురించి ఇలాంటి వార్తనే ప్రచురించింది. అప్పటికీ ఇప్పటికీ మనుషులపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయా అనేది తెలియరాలేదు. 


logo