గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Apr 20, 2020 , 19:03:50

ఇజ్రాయెల్‌ దగ్గర 100 శాతం పనిచేసే కరోనా మందు?

ఇజ్రాయెల్‌ దగ్గర 100 శాతం పనిచేసే కరోనా మందు?

హైదరాబాద్: ఇజ్రాయెల్‌ కరోనా వైరస్‌కు 100 శాతం చికిత్స చేసే మందును కనిపెట్టిందని వార్తలు వస్తున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురైనవారు కూడా ఈ మందుతో బాగవుతారని వినిపిస్తున్నది. ఈ మందును ప్రస్తుతం మొదటిసారిగా అమెరికాలో పరీక్షిస్తున్నారని తెలిసింది. ప్లూరిస్టెమ్ థెరాపెటిక్స్ అనే బయోటెక్ కంపెనీ ఈ మందును తయారు చేసింది. ఇజ్రాయెల్‌ లోని హైఫాలో గల ఈ కంపెనీ తయారుచేసిన కరోనా మందు పేరు అలోజెనీక్ ప్లాసెంటల్ ఎక్స్‌పాండెడ్ సెల్స్ (పీఎల్ఎక్స్). శ్వాస తీసుకోలేకపోవడం, అంతర్గతంగా కిడ్నీ, గుండె తదితర అవయవాలు చెడిపోవడం వంటి తీవ్రస్థితిలో ఉన్న ఏడుగురు పేషంట్లు ఈ మందు వాడిన తర్వాత కోలుకున్నారని కంపెనీ అంటున్నది. అందులో ఒకరోగి మాత్రం తీవ్రమైన శ్వాససమస్య అత్యధిక కరోనా రోగుల్లో మరణానికి కారణం ప్రమాదకరమైన రీతిలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం. దీనిని పీఎల్ఎక్స్ నయం చేస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం అమెరికాలో తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఓ కరోనా రోగికి ఈ మందు ఇచ్చారట. ఫలితాలు ఇంకా రాలేదు. ప్రసవ సమయంలో వెలువడే ప్లాసెంటాతో కంపెనీ ఈ మందును తయారు చేస్తున్నది. నియంత్రణాధికారుల అనుమతి లభించగానే పెద్దఎత్తున మందును తయారు చేస్తామని కంపెనీ సీఈవో యాకీ యానే చెప్పారు. ఈ చికిత్సలో ప్లాసెంటల్ ఎక్స్‌పాండెడ్ సెల్స్‌ను 15 మిల్లీలీటర్ల డోసులో కండరాల ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. అవి విడుదల చేసే ప్రొటీన్లు రోగాన్ని నయం చేస్తాయని ఆయన వివరించారు. రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందించి రోగిని దెబ్బతీయకుండా చూడడమే ఈ చికిత్స ప్రత్యేకత అని యానే అంటున్నారు. అయితే ఇజ్రాయెల్‌కు చెందిన ప్రజారోగ్య నిపుణుడు మాన్‌ఫ్రెడ్ గ్రీన్ ఈ చికిత్స పనిచేస్తుందనే నమ్మకం తనకు ఏమాత్రం లేదని చెప్పడం గమనార్హం. కరోనా అనేది ఏదో అంతరిక్షం నుంచి వచ్చిన జబ్బుకాదని, అదొక వైరల్ వ్యాధి మాత్రమేనని ఆయన అన్నారు. వైరల్ వ్యాధికి చికిత్స అనేది ఎప్పుడూ కష్టసాధ్యంగానే ఉంటుందని గుర్తు చేశారు. ఈలోగా కంపెనీ షేర్లు మాత్రం భారీగా పెరిగాయి.logo