శుక్రవారం 05 మార్చి 2021
Health - Feb 23, 2021 , 17:47:52

జుట్టు ఊడిపోతోందా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి!

జుట్టు ఊడిపోతోందా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి!

ప్రతి ఒక్కరూ అందమైన, ఆరోగ్యకరమైన జుట్టునే కోరుకుంటారు. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్ర షెడ్యూల్ గురించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ వెంట్రుకలను కాపాడుకోవచ్చు. మనం మొత్తం ఆరోగ్యంగా ఉంటేనే మంచి జుట్టు సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి ఆరోగ్యం.. ఆ వ్యక్తి జుట్టు ఆకృతిని, జుట్టు పెరుగుదలను, జుట్టు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తులు ఎల్లప్పుడూ జుట్టు రాలుతుండటాన్ని ఫిర్యాదు చేస్తుంటారు. వెంట్రుకలను బిగుతుగా వెనక్కి లాగి కట్టే ‘పోనీ టెయిల్‌’ హెయిర్‌ స్టయిల్‌, వెంట్రుకలను బిగుతుగా పట్టి ఉంచే క్లిప్పుల వల్ల వెంట్రుకలు ఊడతాయి. తరచుగా డైయింగ్‌, స్ట్రయిటెనింగ్‌ మొదలైన బ్యూటీ ట్రీట్మెంట్లను వాడుతూ ఉన్నా జుట్టు రాలిపోవచ్చు.

కొంతమంది మెరిసే, మృదువైన జుట్టుతో ఆకర్శణీయంగా ఉంటారు. మరికొందరు అందంగా ఉన్నా జుట్టు పలుచగా ఉండటం వల్ల విగ్గులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇలాంటి వారు కొంచెం ప్రయత్నం చేస్తే ఆరోగ్యకరమైన జుట్టు పొందడం కఠినమైనదేం కాదు. బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి మొదట మీ జుట్టు రకం ఏమిటో తెలుసుకోవాలి. వాటిని ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై దృష్టిసారించాలి. జుట్టు పెరుగుదలను నిరోధించే ఐదు తప్పులను గుర్తించి అవి మీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోండి

జుట్టును ఎక్కువగా కడగడం 


వెంట్రుకలు తాజాగా కనిపించడానికిచ అనుభూతి చెందడానికి చాలా మంది ప్రతిరోజూ, కొన్నిసార్లు రోజుకు రెండుసార్లు కూడా జుట్టు కడుగుతుంటారు. ఇలా చేయడం వలన జుట్టును అపారంగా దెబ్బతీస్తుందని గుర్తించాలి. అలాగే ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. జుట్టును ఎక్కువగా కడగడం వల్ల జుట్టుకు సహజమైన నూనెలు పోయి నీరసంగా, అనారోగ్యంగా తయారవుతాయి.

ఎక్కువ వేడిని ఉపయోగించడం 


జుట్టును నచ్చినట్లుగా తీర్చిదిద్దేందుకు చాలా మంది హీటింగ్‌ టూల్స్ తరచుగా వాడుతుంటారు. ఫ్లాట్ ఐరన్, హెయిర్ కర్లర్, హెయిర్ డ్రయ్యర్లను ఉపయోగించడం వల్ల జుట్టు ఆకృతిని దెబ్బతీస్తుంది. ఇలా చేయడం వల్ల వెంట్రుకల చివర్లు చీలికలుగా ఏర్పడి చచ్చుబడిపోతాయి. ఇది జుట్టు పెరుగుదలను కూడా నిరోధిస్తుంది. జుట్టుపైన హీటింగ్‌ టూల్స్ వాడకాన్ని పరిమితం చేయడం చాలా అవసరం.

తడి జుట్టును బ్రష్ చేయడం 


తడి జుట్టును ఎప్పుడూ దువ్వెన లేదా బ్రష్ చేయకూడదు. దువ్వడానికి ముందు జుట్టు సహజంగా ఆరిపోయే వరకు వేచి ఉండాలి. తడి జుట్టును దువ్వెనతోగానీ, బ్రష్‌ చేయడం వల్లగానీ వెంట్రుకలు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. వెంట్రులకను ఎప్పుడూ తడిగా ఉన్నప్పుడు కట్టకుండా చూసుకోవాలి. జుట్టు ముడేసుకోవడానికి ముందు సహజంగా ఆరిపోవడం ముఖ్యం.

 తప్పుడు మార్గంలో కండీషనర్‌ను ఉపయోగం


కొంత మంది కండీషనర్‌ను అస్సలు ఉపయోగించరు. అది కూడా తప్పే. జుట్టుకు కండిషనింగ్ చాలా ముఖ్యం. జుట్టు మీద కండీషనర్‌ను స్లాటర్ చేయడం కూడా తప్పే. కండీషనర్ జుట్టు చివరలకు మాత్రమే వర్తించాలి.  

జుట్టును తువ్వాలుతో ఎండబెట్టడం 


జుట్టును ఉద్దేశపూర్వకంగా తువ్వాలతో పొడి చేయడానికి ప్రయత్నించడం చాలా చెడ్డ పద్ధతి. జుట్టును తువ్వాలతో తుడిచే ముందు సహజంగా ఆరబెట్టడానికి వదిలివేయాలి. టవల్‌తో గట్టిగా అదిమిపట్టి తుడవడం ద్వారా జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే ఈ తప్పును నివారించాల్సిందే.

మందులతో సైడ్ ఎఫెక్ట్స్


హర్మోన్ల లోపం కారణంగా కూడా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. మందుల ప్రభావంతో కూడా జట్టు ఊడిపోతుంటుంది. డ్రగ్స్ వాడినప్పుడు కూడా ఆ ప్రభావం జుట్టుపై పడుతుంది. యాంటీ డిప్రజెంట్స్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి జుట్టు ఊడిపోవడం ప్రారంభమవుతుంది.

ఆహారంలో లోపాలు


ఆహారపు అలవాట్లలో చేసే తప్పులు జుట్టుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అకస్మాత్తుగా డైటింగ్‌కు పూనుకోవడం, మాంసం ఎక్కువగా తినడం, పోషకాహార లోపం తలెత్తి జుట్టుకు కావాల్సిన జింక్, ఐరన్ కొరత వల్ల కూడా ఊడిపోతుంటాయి. జింక్, బయోటిన్ సప్లిమెంట్స్ మూడు నెలల వరకు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. 

ఇవి కూడా చదవండి..

పన్నాలో కార్మికులకు దొరికిన వజ్రాలు

30 కోట్ల ఈ-మెయిల్‌ ఐడీలు లీక్‌..!

పింక్‌ బాల్ టెస్ట్‌లో కోహ్లీ చరిత్ర సృష్టించేనా..?

వైర్లు లేకుండానే న్యూజిలాండ్‌లో విద్యుత్‌ సరఫరా..!

తొలిసారిగా అమలులోకి వచ్చిన ఐఎస్‌ఓ ధ్రువీకరణ

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo