మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Sep 15, 2020 , 20:53:49

తుమ్ములు వెంట‌నే ఆగిపోవాలంటే.. ఇలా చేయండి !

తుమ్ములు వెంట‌నే ఆగిపోవాలంటే.. ఇలా చేయండి !

వ‌ర్షాల కార‌ణంగా వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌స్తాయి. దీంతో ఎల‌ర్జీకి గుర‌వుతుంటారు. ముఖ్యంగా జ‌లుబు, ద‌గ్గు, తుమ్ముల బారిన ఎక్కువ‌గా ప‌డుతుంటారు. అస‌లే క‌రోనా. ఈ టైంలో వీటిలో ఏ ఒక్క‌దానికి గురైనా ప్ర‌మాద‌మే. అందుకే జాగ్ర‌త్త‌గా ఉండాలి. జ‌లుబు చేసేలా ఉంది క‌దా అని వెంట‌నే టాబ్లెట్ వేసుకోకుండా ఈ చిన్న చిట్కా ఫాలో అయిపోండి. అదే వంటింట్లో దొరికే మెంతులు. మ‌రి దీంతో ఎలా చేయాలో తెలుసుకోండి.

* మెంతులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అంద‌రికీ తెలిసిందే. అయితే ఇవి ఎల‌ర్జీకి గురై వ‌చ్చే తుమ్ముల‌ను సైతం ఆపేస్తాయి.

* మెంతులు, మిరియాలు, వాము. ఈ మూడింటినీ స‌మానంగా తీసుకొని పోడి చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఎయిర్‌టైట్ కంటైన‌ర్‌లో స్టోర్ చేసి పెట్టుకోవాలి.

* ఉద‌యాన్నే ఒక త‌మ‌ల‌పాకు తీసుకొని అందులో ఒక గ్రా. మెంతులు, వాము, మిరియాల చూర్ణాన్ని అర టీస్పూన్ తీసుకోవాలి. దీంతోపాటు తేనె కూడా క‌లిపి ఆకును చుట్టి న‌మిలి మింగాలి. 

* ఇలా చేయ‌డం వ‌ల్ల తుమ్ములు ఆగిపోవ‌డంతోపాటు రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.  

* మెంతులు జుట్టు పెరుగుద‌ల‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఉసిరిక‌, మినుములు, మెంతుల పొడిని రాత్రంతా నాన‌బెట్టి నిమ్మ‌ర‌సం వేయాలి. ఈ మిశ్ర‌మాన్ని మ‌రుస‌టి ఉద‌యం త‌ల‌కు ప‌ట్టించి రెండు గంట‌ల త‌ర్వాత మేలైన షాంపూతో స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.

* అయితే ఈ ప‌ద్ద‌తిని గ‌ర్భిణీ స్త్రీలు పాటించ‌క‌పోవ‌డం మంచిది.

* మెంతులు, శొంఠి పొడిని తేనెతో క‌లిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. దీనివ‌ల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి ఆరోగ్యాన్ని ప్ర‌సాదిస్తుంది. కీళ్ల నొప్పులు, కండ‌రాల స‌మ‌స్య‌ల‌కు మెంతులు మేలు చేస్తుంది. 


logo