బుధవారం 03 జూన్ 2020
Health - Apr 03, 2020 , 13:27:55

ఆలూ చిప్స్‌ ఎక్కువగా తింటున్నారా?

ఆలూ చిప్స్‌ ఎక్కువగా తింటున్నారా?

ఆలూ చిప్స్‌ తినని వారు ఎవరూ ఉండరు. సాధారణంగా ఆలూ చిప్స్‌ను రోడ్‌సైడ్‌ షాపుల్లో అప్పటికప్పుడు తయారు చేసి తాజాగా ఇస్తారు. మరి రంగురంగుల పాకెట్లలో అమ్మే చిప్స్‌ మాటేమిటి? అవి ఎప్పుడో తయారు చేసుంటారు? కానీ కరకరలాడుతూనే ఉంటాయి. పైగా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. పిల్లలైతే ఇక చెప్పనక్కర్లేదు. వాటికి బానిసలైపోతారు. మరి ఆ కరకరలాడే చిప్స్‌ వెనకాల దాగిన రహస్యం(రసాయనం) ఏంటో తెలుసా? అదే సోడియం బై స‌ల్ఫైట్‌.. దాన్ని టాయిలెట్‌ క్లీనర్లలో కూడా వాడుతారట. 

చిప్ప్ త‌యారీకి ముందు ఆలూ తొక్కు తీసి బాగా క‌డుగుతారు. త‌ర్వాత ఫ్రై చేస్తారు. దీనికి స్పైసీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. ఇదంతా బాగానే ఉంది. దీని త‌ర్వాత చిప్స్ క‌ర‌క‌ర‌లాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు కెమిక‌ల్స్ వాడుతారు. అందులో సోడియం బై స‌ల్ఫైట్ ఒక‌టి. ఇదొక సింథ‌టిక్ కెమిక‌ల్‌. చిప్స్‌ను చాలారోజుల వ‌ర‌కు రంగు మార‌కుండా ఉంచుతుంది. అంతేకాకుండా ప్యాకెట్‌లో క్రిముల పెరుగుద‌ల‌ను ఆపుతుంది. ఇది స‌ల్ఫ‌ర్ డ‌యాక్సైడ్‌ని రిలీజ్ చేస్తూ ప‌నిచేస్తున్న‌ది. అయితే.. ఇదే కెమిక‌ల్ టాయిలెట్ క్లీన‌ర్స్‌లో ఎక్కువ మోతాదులో ఉప‌యోగిస్తారు. యూఎస్ నేష‌న‌ల్ లైబ్ర‌రీ ఆఫ్ మెడిసిన్ వాళ్లు చెప్పిందేంటంటే.. సోడియం బై స‌ల్పైట్ అనేది డ్రై యాసిడ్‌. అది భ‌యంక‌ర‌మైన‌ది. దీనివ‌ల్ల గాలిపీల్చుకోవ‌డం, డ‌యేరియా, ఛాతిలో నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ప్రాసెస్‌ చేసి  అందంగా ప్యాక్‌ చేసిన చిప్స్‌లాంటివి తినేముందు, ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి.


logo