శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Health - Jul 06, 2020 , 18:30:01

మిన‌ర‌ల్ వాట‌ర్ తాగుతున్నారా? అయితే ఈ మిన‌ర‌ల్స్‌ను కోల్పోయిన‌ట్లే!

మిన‌ర‌ల్ వాట‌ర్ తాగుతున్నారా? అయితే ఈ మిన‌ర‌ల్స్‌ను కోల్పోయిన‌ట్లే!

మిన‌ర‌ల్ వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల కూడా ఆనారోగ్యానికి గుర‌వుతార‌ని తెలుసా? అదేంటి ఆరోగ్యంగా ఉండాల‌నే క‌దా నీటిని కొనుగోలు చేసి మ‌రీ తాగుతున్నాం అంటారేమో.. అస‌లు విష‌యం తెలిస్తే ఏ నీరు మంచివో మీకే అర్థ‌మ‌వుతుంది. బావినీరు తాగే ప‌ల్లెటూళ్లు కూడా ఇప్పుడు మిన‌ర‌ల్ వాట‌ర్‌కు అల‌వాటు ప‌డ్డాయి. ఈ నీరు తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌స్తుందో తెలుసుకోండి.

1. నిపుణులు సైతం మిన‌ర‌ల్ వాట‌ర్ తాగొద్ద‌ని చెబుతున్నారు. ఎందుకంటే మిన‌ర‌ల్ వాట‌ర్‌లో అస‌లు మిన‌ర‌ల్సే ఉండ‌వ‌ట‌. పైగా ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల కిడ్నీ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. కిడ్నీల్లో రాళ్లు చేరి అనారోగ్యానికి గురిచేస్తుంది. 

2. వ‌య‌సు దాటితే వ‌చ్చే మోకాళ్ల నొప్పులు మిన‌ర‌ల్ వాట‌ర్ తాగేవారిలో ముందుగానే వ‌స్తాయి. అంతేకాదు ఈ నీటిని ప్లాస్టిక్ బాటిల్స్‌, వాట‌ర్ క్యాన్ల‌లో స్టోర్ చేయ‌డ‌మే. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే క్యాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, స‌ల్ఫ‌ర్‌, మెగ్నీషియం వంటి మిన‌ర‌ల్స్‌ను ఈ నీరు తాగ‌డం వ‌ల్ల కోల్పోతాం.  

3. మ‌రి ఏ నీరు తాగాలి అనుకునేవాళ్ల‌కు చెప్పేది ఒక‌టే. కాచిన నీరు తాగడం ఉత్త‌మం. అంతేకాదు ప్లాస్టిక్ బాటిల్స్‌ను తొలిగించి రాగి పాత్ర‌లు, కుండ‌లో స్టోర్ చేసి పెట్టుకోవాలి.  కుండనీరు తాగ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి. 

4. త‌క్కువ నీరు తాగేవారు భ‌విష్య‌త్తులో చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శరీరంలోని అన్నీ జీవ‌క్రియలకు నీరే ఆధారం. జీర్ణ సమస్యలు, మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలు నీరు ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల దూరం అవుతాయి.

5. నీరు ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తుంది. నీరు ఎక్కువ తాగాలంటే మిన‌ర‌ల్ వాట‌ర్ క‌న్నా.. నార్మ‌ల్ నీరు తాగితేనే మంచిది అంటున్నారు నిపుణులు. 

 logo