బుధవారం 08 జూలై 2020
Health - Apr 01, 2020 , 15:31:53

రిషీ ట్వీట్‌కు మర్కజ్ మసీదు ఉదంతమే కారణమా?

రిషీ ట్వీట్‌కు మర్కజ్ మసీదు ఉదంతమే కారణమా?

హైదరాబాద్: సీనియర్ బాలివుడ్ నటుడు రిషీకపూర్ ఎమర్జెన్సీ గురించిన ట్వీట్ ఎందుకు పెట్టారు? ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ఉదంతమే 


అందుకు కారణమా? ప్రస్తుతం నెటిజనుల మధ్య ఇదే చర్చ నడుస్తున్నది. ఆజ్ యె హువా, కల్ క్యాహోనా హై? దటీజ్ వై ఐ సెడ్ వుయ్ నీడ్ మిలిటరీ 


ఔట్. ఎమర్జెన్సీ.. ఇదీ రిషీ ట్వీట్. (ఇవాళ ఇది జరిగింది.. రేపు ఇంకేం జరుగుతుందో.. అందుకే సైన్యం బయటకు రావాలి. అత్యవసర స్థితిని 


ప్రకటించాలి అని ఆ ట్వీట్ అర్థం.) ఆయన ఫలానా ఘటన అని ఏదీ ప్రస్తావించలేదు. దీంతో ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఎక్కువమంది 


భావిస్తున్నది మాత్రం మర్కజ్ మసీదు ఉదంతం కారణంగానే రిషీ ఆ ట్వీట్ పెట్టారని. నియమాలను గాలికి వదిలి, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ 


మర్కజ్ మసీదులో నిర్వహించిన మతపరమైన కార్యక్రమం కరోనా ఉగ్రరూపం దాల్చడానికి కారణమైన సంగతి తెలిసిందే. మలేసియా, ఇండొనేసియా 


తదితర దేశాల నుంచి వచ్చినవారితో మర్కజ్‌లో నిర్వహించిన మతపరమైన కార్యక్రమం తబ్లీగీ జమాత్. ఈ కార్యక్రమానికి తెలంగాణతో సహా అనేక 


రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో జనం హాజరు కావడంతో కరోనా పెచ్చరిల్లింది. తెలంగాణలో మర్కజ్ నుంచి వ చ్చిన ఏడుగురు ఏకంగా ప్రాణాలే 


కోల్పోయారు. తెలంగాణ సర్కారు అప్రమత్తం చేయడంతో ఢిల్లీ సర్కారు మేలుకుని మర్కజ్‌పై చర్యలు చేపట్టింది. రిషీని కదిలించిన ఘటన ఇంతకన్నా 


ఏముంటుంది అనేది పలువురి వాదన. 


logo