రాత్రి పూట అరటిపండ్లను తినవచ్చా..?


Mon,April 2, 2018 10:26 AM

అరటిపండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటిపండ్లలో మన శరీరానికి కావల్సిన ఎన్నో కీలకమైన పోషకాలు ఉంటాయి. అరటి పండ్లలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరిచే గుణాలు అరటిపండ్లలో ఉన్నాయి. అయితే అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలిగే మాట నిజమే అయినా వాటిని రాత్రి పూట మాత్రం కొందరు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది.

అరటిపండ్ల‌ను కఫ శరీరం ఉన్నవారు తినరాదు. అందులోనూ వారు రాత్రిపూట అయితే అరటిపండ్లను అసలు తినరాదు. తింటే జీర్ణవ్యవస్థలో విష పదార్థాలు పేరుకుపోతాయి. దగ్గు, జలుబు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అధిక బరువు కూడా పెరుగుతారు. కనుక కఫ శరీరం ఉన్నవారు అరటిపండ్లను రాత్రిపూట అస్సలు తినరాదు. పగటిపూట ఒక పండును తినవచ్చు. ఇక మిగిలిన వారు అయినా సరే నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందు మాత్రమే అరటి పండ్లను తినాలి. ఎందుకంటే ఆ సమయంలో తింటేనే వాటి ద్వారా వచ్చే శక్తి నిద్రపోయేసరికి ఖర్చవుతుంది. లేదంటే అది కొవ్వు శక్తి నిల్వ కింద మారుతుంది. కనుక రాత్రి పూట అరటి పండ్లను తినేవారు పై విషయాలను గుర్తు పెట్టుకుంటే మంచిది.

7187

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles