ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Health - Dec 28, 2020 , 20:05:39

ఉపవాసం చేస్తున్నప్పుడు పాలు తాగొచ్చా..?

ఉపవాసం చేస్తున్నప్పుడు పాలు తాగొచ్చా..?

ఉపవాసం అనేది ఒకప్పటి ఆచారమే అయినా.. ఇప్పుడది ఫ్యాషన్ అయింది. డైటింగ్, హెల్త్ కాన్షియస్, ఫిట్ నెస్ ఇలా వేరు వేరు కారణాలు చెప్పుకుంటూ ప్రతిఒక్కరూ ఫాస్టింగ్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఉపవాసం అనేది శరీరానికి తక్కువ కేలరీలను అందిస్తుంది. నిజానికి ఉపవాసంలో ఉన్నప్పుడు ఆహార ఎంపికలపై ఎలాంటి పరిమితి లేదు. కాబట్టి చాలా మంది కొన్ని పాలు, పళ్ల రసాలు లాంటివి తీసుకుంటుంటారు. కానీ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మీరు తాగే డ్రింక్స్ లో కొన్ని మీ ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తాయని మీకు తెలుసా. అవును మీరు విన్నది నిజమే.. ముఖ్యంగా ఉపవాసంలో ఉన్నప్పుడు పాలు తాగొచ్చా లేదా అనే విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.. 

ఉపవాసం చేయడానికి ముఖ్యమైన కారణం బరువు తగ్గడం. అంటే శరీరానికి తక్కువ కేలరీలను అందించడం అన్నమాట. దీంతో పాటు జీర్ణక్రియపై కూడా కాస్త దృష్టి పెట్టడం. ఫాస్టింగ్ ఉన్నప్పుడు మీ శరీరం ఆకలి గురించి ఆలోచిస్తుంది, అలాగే జీర్ణక్రియలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో శరీరం కెటోసిస్‌లోకి ప్రవేశిస్తుంది. ఇవి శరీరంలో కార్బోహైడ్రేట్లు అందుబాటులో లేనప్పుడు కొవ్వుశక్తి కోసం ఉపయోగపడుతుంది.  

ఉపవాసం ఉన్నప్పుడు బాడీని హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు మీరు కూరగాయలు, పండ్లు సరిపోవు కాబట్టి.. పానీయాలపై ఆధారపడాల్సిందే. అయితే.. పిండి పదార్థాలు లేదా చక్కెరతో కూడిన పానీయాలు మీ శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. కాబట్టి వీటిని తాగడం వల్ల మీరు ఉపవాసం ఉన్న ఫలితం లేకుండా పోతుంది.

పాలు తాగొచ్చా..?

పాల విషయానికొస్తే.. ఉపవాసం ఉన్నప్పుడు వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాలు, పాల పదార్థాల్లో కేలరీలు, సహజ చెక్కర, పిండి పదార్థాలు ఉంటాయి. ఒక కప్పు పాలలో దాదాపు 12గ్రాముల పిండి పదార్థాలుంటాయి. ఇవి ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. కాబట్టి ఫాస్టింగ్ టైంలో పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది. తప్పనప్పుడు.. పావు కప్పు పాలతో టీ లేదా కాఫీ తాగితే ఏం కాదు. ఇవి మీ ఆకలిని అరికడతాయి. అలా కాకుండా ఎక్కువ పాలు తాగడం వల్ల మీ శరీరానికి ఎక్కువ కేలరీలు అంది బరువు పెరిగే అవకాశం ఉంది.

మరేం తాగాలి..?

ఉపవాసం ఉన్నప్పుడు శరీరం కీటోసిన్ ను సరైన స్థాయిలో నిర్వహించడానికి కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మంచిది. అంటే..

నీరు- ఇవి సున్నా కేలరీలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి.

కాఫీ లేదా టీ- మీరు టీ లేదా కాఫీ తాగాలనుకుంటే అందులో చక్కెర, పాలు లేదా క్రీమ్ జోడించవద్దు.

ఆపిల్ సైడర్ వెనిగర్- ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం మంచిది. ఇది ఉపవాస సమయంలో కోరికలను నివారించేందుకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి.. 

లవంగం తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
తెల్ల బియ్యం వ‌ద్దు.. ముడి బియ్య‌మే ముద్దు!
యాలకుల టీతో ఇన్ని ప్రయోజనాలా?

జ్వరం వచ్చినప్పుడు తినకూడని ఆహార పదార్థాలేంటి..?

శృంగారానికి ముందు ఇవి తిన్నారంటే ఇరగదీస్తారు!

వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?

వ్యాక్సిన్లు.. వాటి పుట్టుక.. కొన్ని నిజాలు!
శృంగారం వల్ల కలిగే ప్రయోజనాలివే..

గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ?

VIDEOS

logo