శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Jun 19, 2020 , 17:04:52

పెంపుడు కుక్క‌ను ముద్దాడ‌డం మంచిదేనా? తెలుసుకోవాల్సిన విష‌యాలు!

పెంపుడు కుక్క‌ను ముద్దాడ‌డం మంచిదేనా?  తెలుసుకోవాల్సిన విష‌యాలు!

ఈరోజుల్లో ప్ర‌తి ఇంట్లో ఒక పెట్ ఉండ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అందులో ఎక్కువ‌గా కుక్క‌నే పెంచుకుంటూ ఉంటారు. విశ్వాసానికి మారుపేరైన కుక్కను సొంత బిడ్డ‌లా చేర‌దీస్తారు. అన్నం తినిపిస్తారు. కౌగిలించుకుంటారు. ఇంకా ప్రేమ‌ ఎక్కువైతే ముద్దు కూడా పెట్టుకుంటారు. అయితే ఇలా ముద్దు పెట్టుకోవ‌డం ఎంత‌ వ‌ర‌కు మంచిద‌న్న‌ విష‌యాల‌పై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

* సాధార‌ణంగా కుక్క‌ల లాలాజ‌లం మాన‌వ లాలాజ‌లం కంటే శుభ్రంగా ఉంటుంద‌ని పురాణంలో ఉంది. అలాగే వాటి నోటిలో వేల బ్యాక్టీరియా ఉంద‌ని కూడా చెబుతున్నారు. కుక్క‌ను ముద్దు పెట్టుకునేట‌ప్పుడు మూతి భాగంలో శుభ్రంగా ఉందో లేదో చెక్ చేయాలంటున్నారు అమెరిక‌న్ వెట‌ర్న‌రీ మెడిక‌ల్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు క్లార్క్ ఫోబియ‌న్.

* అలాగే పెట్స్ పెరిగే ప్రాంతం కూడా శుభ్రంగా ఉంచాలి. కుక్క‌లు ఎంత సుర‌క్షితంగా ఉన్న‌ప్ప‌టికీ ముద్దు పెట్టుకోవ‌డం అంత మంచిది కాదు. ఉదాహ‌ర‌ణ‌కు కుక్క‌కు చెవిలో ఇన్ఫెక్ష‌న్ ఉంటే చేతుల‌తో ప‌ట్టుకోవ‌డం గోక‌డం వ‌ల్ల సూక్ష్మ‌క్రిములు శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయి అనే విష‌యాన్ని తెలుసుకోవాలి.  

వీరు జాగ్ర‌త్త‌గా ఉండాలి : 

డయాబెటిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, అవయవ మార్పిడి, క్యాన్సర్ వంటి రోగాలు ఉన్న‌వారు కుక్క‌లకు కాస్త దూరంగా ఉండాలి. పిల్ల‌లు, ప‌సిబిడ్డ‌లు కూడా వారి రోగనిరోధక వ్యవస్థలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

కుక్క‌కు ఇష్ట‌మేనా?   

ముద్దుపెట్టుకోవ‌డం కుక్క‌ల‌కు ఇష్ట‌మో కాదో ముందు తెలుసుకోవాలి. ఇష్టం లేక‌పోతే కుక్క‌ల ప్ర‌వ‌ర్త‌న వేరేలా ఉంటుంది. దూరంగా వెళ్లిపోవ‌డం, ముఖం చాటేయ‌డం వంటి ప‌నులు చేస్తుంటుంది. ఈ సంకేతాల‌ను బ‌ట్టి వ్య‌వ‌హ‌రించాలి. 

 


logo