బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Jul 23, 2020 , 20:50:46

చార్‌కోల్ టూత్‌పేస్ట్‌.. అచ్చం బొగ్గుతో ప‌ళ్లు తోమిన‌ట్లుగానే!

చార్‌కోల్ టూత్‌పేస్ట్‌.. అచ్చం బొగ్గుతో ప‌ళ్లు తోమిన‌ట్లుగానే!

పాత కాలంలో మ‌న పూర్వీకులు దంతాల‌ను శుభ్రం చేసుకునేందుకు బొగ్గును ఉప‌యోగించేవారు. అప్ప‌ట్లో ఎలాంటి టూత్‌పేస్టులు అందుబాటులో లేవు. బొగ్గు త‌ర్వాత మెల్లి మెల్లిగా ప‌ళ్ల‌పొడి వ‌చ్చాయి. దాన్ని కాస్త డెవ‌ల‌ప్ చేయ‌డంతో పేస్టులు త‌యారు చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ పాత‌కాలం ప‌ద్ధ‌తుల‌నే ఎంచుకుంటున్నారు. బొగ్గుతో ప‌ళ్లు తోముకుంటే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని దానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. మ‌రి బొగ్గు కావాలంటే ఇంట్లో క‌ట్టెల పొయ్యి వెలుగుతుండాలి క‌దా అనుకుంటారేమో.. ఇప్పుడు ఆ అవ‌స‌రం లేదు. చార్‌కోల్ పేస్ట్ వ‌చ్చేసింది. మ‌రి ఈ పేస్టుతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలో తెలుసుకుందామా..

యాక్టివేటెడ్ చార్‌కోల్, ఎక్స్ట్రావ‌ర్జిన్ కోకోన‌ట్ ఆయిల్‌, ఎగ్ షెల్ పౌడ‌ర్ అనే మూడు ప‌దార్థాల‌తో చేసిన టూత్‌పేస్ట్ అన్నీ టూత్‌పేస్ట్‌ల్లానే ప‌నిచేస్తుంది. ఇది పంటిపై పొర‌ని పాడుచేయ‌దు. 

* పళ్ళ మీద మరకలని పోగొట్టి ప‌ళ్ల‌ను తెల్ల‌గా చేయ‌డానికి యాక్టివేటేడ్ చార్ కోల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే నోటి దుర్వాస‌న‌ని కూడా పోగొడుతుంది. 

* ఎగ్ షెల్ పైడ‌ర్‌లో ఉన్న క్యాల్షియం ప‌ళ్ళ‌ని బ‌లంగా చేస్తుంది. 

* దంతాల నుంచి వ‌చ్చే దుర్వాస‌న‌ను పోగొట్ట‌డంతో పాటు ప‌ళ్ళు పాడైపోకుండా చేయ‌డానికి  ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాదు ప‌ళ్ల‌ని సున్నిత‌త్వం నుంచి దృఢంగా చేస్తుంది. 

చార్‌కోల్ టూత్‌పేస్ట్ త‌యారీ :

ఒక టేబుల్ స్పూన్ ఎగ్ షెల్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్‌లో అర టీ స్పూన్ యాక్టివేటెడ్ చార్ కోల్ వేసి బాగా క‌లుపాలిజ‌. వీటిని చెక్కతో చేసిన స్పూన్‌తో కల‌పాలి. ఐస్‌క్రీమ్‌తో ఇచ్చే స్పూన్స్ వాడొచ్చు. స్మూత్‌గా పేస్ట్‌లా క‌ల‌పాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబ‌డ‌ని డబ్బాలో వేసి పెట్టాలి. బ్రెష్ చేసుకునేటప్పుడు చిన్న చెక్క స్పూన్‌తో బ్రెష్ మీద వేసుకొని మామూలుగా బ్రెష్ చేసుకుంటే స‌రిపోతుంది. అయితే, గోరువెచ్చని నీటితో పుక్కిలించండి. ఇది మీ రెగ్యులర్ టూత్‌పేస్ట్ బదులుగా రోజూ వాడుకోవచ్చు. 


logo