మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Aug 07, 2020 , 19:31:02

మ‌త్తుమందు ఇచ్చిన‌ త‌ర్వాత బిడ్డ‌కు పాలు ఇవ్వొచ్చా? ఇస్తే ఏమ‌వుతుంది!

మ‌త్తుమందు ఇచ్చిన‌ త‌ర్వాత బిడ్డ‌కు పాలు ఇవ్వొచ్చా? ఇస్తే ఏమ‌వుతుంది!

పుట్టిన బిడ్డ‌కు త‌ల్లిపాల కంటే శ్రేయ‌స్క‌రం రెండోది లేదు. బిడ్డ‌ ర‌క‌ర‌కాల ఇన్ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా తల్లిపాలే కాపాడుతాయి. మ‌రి ఆ త‌ల్లికి ఆప‌రేష‌న్ చేసేందుకు మ‌త్తుమందు ఇచ్చి ఉంటారు. మ‌త్తుదిగ‌క‌ముందే పాలు ఇస్తే బిడ్డ‌కు ఏమైనా అవుతుందా? అని చాలామందికి సందేహం వెంటాడుతూనే ఉంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

ఆప‌రేష‌న్ కోసం ఇచ్చిన మ‌త్తు త‌ర్వాత కూడా కాసేపు అలానే ఉంటుంది. అయితే పాలివ్వ‌గ‌లిగే ప‌రిస్థితులో గ‌నుక త‌ల్లి ఉంటే ఎలాంటి సందేహం లేకుండా బిడ్డ‌కు పాలు ప‌ట్టించ‌వ‌చ్చు. ప‌రిశోధ‌న‌లో తేలిన విష‌యం ఏంటంటే.. ఎనస్తీషియా తరువాత అతి కొద్ది శాతం మాత్రమే తల్లిపాల వరకూ వెళ్తాయి, తాగిన బిడ్డ‌లో కూడా ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని తేలింది. అయితే బిడ్డ‌కు పాలిచ్చేట‌ప్పుడు, ఆ త‌ర్వాత కూడా త‌ల్లిబిడ్డ‌ల‌ను గ‌మ‌నిస్తూ ప‌క్క‌నే ఎవ‌రైనా ఉండి గ‌మ‌నిస్తూ ఉండాలి. వీరి విష‌యంలో 24 గంట‌ల‌పాటు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలంటున్నారు నిపుణులు.   logo