పెరుగు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

హైదరాబాద్ :పెరుగులో ఆరోగ్యాన్ని అందించే ఎన్నో ప్రయోజనాలున్నాయి. అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ.. బలం పెరగడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా.. పెరుగు తినడం వల్ల శరీరంలో వాతం తగ్గడమేకాకుండా, తిన్న ఆహారాన్ని అరిగించుకునే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదండీ పెరుగు గురించి చాలా మందికి తెలియని విశేషాలు ఎన్నో ఉన్నాయి. అవేంటే..
- పెరుగును వేడి చేయకూడదు. అలా చేస్తే దాన్ని గుణం కోల్పోతుంది.
-ఒబెసిటీ ఉన్న వాళ్లు పెరుగు తినడం మానేయాలి.
-పెరుగును రాత్రి వేళల్లో తినడం మంచిది కాదు. అంతేకాదు.. ఏ సమయంలోనైనా సరే ప్రతిరోజు పెరుగు తినడం కూడా కరెక్ట్ కాదు. అవసరమైతే మజ్జిగలా చేసుకుని తాగాలి.
-పెరుగును వేరే పండ్లతో కలపకూడదు. ఇలా ఎక్కువ కాలం తింటే అలర్జీలు, మెటబాలిజం సమస్యలు తలెత్తుతాయి.
-పెరుగు మాంసం, చేపలతో సరిపడదు. చికెన్, మటన్, చేపలు వండుతున్నప్పడు దాంట్లో పెరుగు వేయడం లేదా ఈ కూరలు తిన్నాక చివరలో పెరుగు తింటే శరీరంలో టాక్సిన్లు విడుదల అవుతాయి.
-చాలా మంది పెరుగును స్పృహ లేకుండా యథేచ్ఛగా తినేస్తుంటారు. పెరుగు మంచిదే కానీ, అదే స్థాయిలో చెడ్డది కూడా. ముఖ్యంగా రాత్రుళ్లు ఎక్కువ తినడం అస్సలు మంచిది కాదట.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు