మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Sep 03, 2020 , 17:15:48

'విట‌మిన్ డి' టాబ్లెట్లు అధికంగా వాడేవారికో హెచ్చ‌రిక!

'విట‌మిన్ డి' టాబ్లెట్లు అధికంగా వాడేవారికో హెచ్చ‌రిక!

విట‌మిన్ డి లోపం ఉన్నా ప‌ట్టించుకోని వాళ్లంద‌రూ క‌రోనా స‌మ‌యంలో శ్ర‌ద్ద వ‌హిస్తున్నారు. క‌రోనాను త‌రిమికొట్టేందుకు విట‌మిన్ డి తోడ్ప‌డుతుంద‌ని అధ్య‌య‌నాల్లో వెల్లడైంది. దీంతో చాలామంది విట‌మిన్ డి టాబ్లెట్లు తెచ్చుకొని మ‌రీ వాడుతున్నారు. ఇలా చేసినా కూడా ముప్పు వాటిల్లుతుంది. సాధార‌ణంగా విట‌మిన్ డి సూర్య‌ర‌శ్మి నుంచి దొర‌కుతుంది. ఇది దొర‌క‌ని వాళ్లంతా టాబ్లెట్ల‌కు అల‌వాటు ప‌డుతున్నారు. అయితే ఈ టాబ్లెట్లు తీసుకోవాల‌నుకునేవాళ్లు వైద్యుల స‌ల‌హాలు తీసుకోవ‌డం మంచిది.

విట‌మిన్ డి టాబ్లెట్లు అధికంగా వాడ‌డం వ‌ల్ల దేహంలో క్యాల్షియం స్థాయి ఎక్కువ అవుతుంది. శ‌రీరంలో విష‌ప‌దార్థాల శాతం పెరుగుతుంది. అంతేకాదు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతార‌ని ముంబయి కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. విట‌మిన్ డి టాబ్లెట్లు వాడేముందు శ‌రీరంలో విట‌మిన్ డి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. దాన్ని బ‌ట్టి వైద్యుల స‌ల‌హా మేర‌కు వాడితే స‌రిపోతుంది.  


logo