ట్రంప్.. మా టీ తాగి ఆరోగ్యంగా ఉండండి


Thu,July 14, 2016 03:29 PM

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష బ‌రిలో ఉన్న రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌న‌కు భార‌త్‌కు చెందిన టీ కంపెనీ 6 వేల అస్సాం గ్రీన్ టీ బ్యాగుల‌ను పంపించింది. మిమ్మ‌ల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండన్న వీడియో సందేశంతో ఈ టీ బ్యాగులను పంపింది కోల్‌క‌తాకు చెందిన టీఅమె సంస్థ‌. డియ‌ర్ ట్రంప్ న‌మ‌స్తే, మేము మీకు చాలా మొత్తంలో గ్రీన్ టీని పంపిస్తున్నాము. శ‌రీరంలోని హానికారక క్రిముల‌ను ఇది నిర్మూలించి మెద‌డు, శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకోసం, అమెరికా కోసం, ప్ర‌పంచం కోసం మీరు ఈ టీ తాగండి అన్న‌ది ఆ వీడియో సందేశం సారాంశం.

నాలుగేళ్ల‌కు స‌రిప‌డా గ్రీన్ టీ బ్యాగుల‌ను పార్సిల్ చేసింది ఈ సంస్థ‌. అయితే దీని విలువ ఎంత‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు. రోజుకు మూడుసార్లు ట్రంప్ టీ తాగుతార‌ని బావించి ఇన్ని బ్యాగులు పంపామ‌ని, ఇంకా కావాల‌న్నా పంపిస్తామ‌ని తెలిపింది. ట్రంప్ మొత్తం ప్ర‌పంచాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నారు.. అలా చేయ‌కుండా ఆయ‌న‌ను ఆప‌లేముగానీ.. క‌నీసం ఆయ‌న‌ను మార్చ‌గ‌లం అని కూడా ఆ వీడియోలో కంపెనీ పేర్కొంది. అయితే భార‌త్ నుంచి వ‌చ్చిన టీ బ్యాగుల‌పై స్పందించ‌డానికి ట్రంప్ స‌న్నిహిత వ‌ర్గాలు నిరాక‌రించాయి.

2011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles