గురువారం 04 జూన్ 2020
Health - Mar 31, 2020 , 13:32:20

అమెరికా కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న భారతీయునికి కరోనా

అమెరికా కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న భారతీయునికి కరోనా

హైదరాబాద్: అమెరికా కాంగ్రెస్ కు డెమొక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగంలోకి దిగిన సూరజ్ పటేల్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ సంగతి ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. న్యూయార్క్ నుంచి పోటీ చేస్తున్న పటేల్ పదిరోజుల నుంచి తనకు కరోనా లక్షణాలు సంక్రమించాయని తెలిపారు. ఛాతీలో పట్టేసినట్టు ఉండడంతోపాటు జ్వరం కూడా వచ్చిందని పేర్కొన్నారు. తన సోదరుడు వైద్యడని, ాయన చేసిన పరీక్షల్లో తన కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయిందని పటేల్ తెలిపారు. స్వీయ క్వారంటైన్ విధించుకున్నామని, ప్రస్తుతం అందరికీ నయమైందని ఆయన వివరించారు. పటేల్ గతంలో అధ్యక్షుడు ఒబామా ఎన్నికల టీంలో పనిచేశారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి విధులకు హాజరు కాగలిగినందుకు సంతోషంగా ఉందని సూరజ్ పటేల్ తెలిపారు. 


logo