గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Feb 20, 2020 , 06:55:48

ఆయర్వేద వైద్యానికి పుట్టినిల్లు భారతదేశం..

ఆయర్వేద వైద్యానికి పుట్టినిల్లు భారతదేశం..

హైదరాబాద్ : ఆయుర్వేద వైద్యానికి పుట్టినిల్లు మన భారతదేశమని ఆయుష్‌ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ లింగమూర్తి అన్నారు. వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధి ఎర్రగడ్డలోని డాక్టర్‌ బి.ఆర్‌.కె.ఆర్‌. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల 80వ వార్షికోత్సవాన్ని బుధవారం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్‌ డైరెక్టర్‌ లింగమూర్తి, వెంగళరావునగర్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌ హాజరై జ్వోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డైరెక్టర్‌ లింగమూర్తి మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్య విధానంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నదని, అందువల్ల ఆయుర్వేద వైద్య విద్యలో సీట్లను పెంచుతూ అన్నిరకాలుగా ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. గత పాలకులు ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయుర్వేద వైద్యం వ్యాప్తి చెందేందుకు ఎంతో కృషి చేస్తున్నారని కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సీ హెచ్‌.రవీందర్‌, ప్రొఫెసర్లు డాక్టర్‌ ఉమా శ్రీనివాస్‌, నర్సింహ, యశోద తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. వార్షికోత్సవం సందర్భంగా గత వారం రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. 


logo
>>>>>>