సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Apr 01, 2020 , 10:53:14

న్యూయార్క్‌లో శవాల నిల్వకు తాత్కాలిక మార్చురీలు

న్యూయార్క్‌లో శవాల నిల్వకు తాత్కాలిక మార్చురీలు

హైదరాబాద్: అమెరికాలో కరోనా కోరలు చాస్తుంటే జనం పిట్టలు రాలినట్టుగా రాలుతున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యంలో కరోనా కల్లోలానికి కేంద్ర బిందువైన న్యూయార్క్ నగరంలో పరిస్థితి గంభీరంగా తయారైంది. ఓవైపు చికిత్స సదుపాయాలు సరిపోక సతమతమవుతుంటే మరోపక్క కరోనాకు బలైనవారి మృతదేహాల నిల్వ పెద్దసమస్యగా మారింది. దీంతో న్యూయార్క్ నగర పెద్దలు తాత్కాలిక మార్చురీలు తయారు చేస్తున్నారు. వీటిని ఆస్పత్రుల దగ్గర రోడ్ల మీదే నిలుపుతున్నారు. ఇవి ఓ షిప్పింగ్ కంటేనర్ సైజులో ఉంటాయి. వీటికి శీతలీకరణ యంత్రం అమర్చి ఉంటుంది. లోపల ఉండే అరలలో శవాలను భద్రపరుస్తున్నారు. శవపేటికలను లోపలకు చేర్చేందుకు వీటి తలుపుల దగ్గర కర్రలతో తయారు చేసిన ర్యాంప్‌ను అమరుస్తున్నారు. ఇవి జనాల్లో కొంత ఆసక్తిని, మరింత భయాందోళనల్ని కలిగిస్తున్నాయి. దారినపోయేవారుి వీటికి మరీ దగ్గరగా రాకుండా ఉండేందుకు తాజాగా కర్రలతో దడిలాంటిది ఏర్పాటు చేశారు. 


logo