శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Mar 31, 2020 , 11:17:41

కేరళలో కేవలం సబ్బు నీళ్లను స్ప్రే చేశారట

కేరళలో కేవలం సబ్బు నీళ్లను స్ప్రే చేశారట

హైదరాబాద్: యూపీలోని బరేలీలో వలస కార్మికులపై ప్రమాదకరమైన రసాయనాన్ని స్ప్రే చేసిన ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. ఢిల్లీ

నుంచి అష్టకష్టాలు పడి తిరిగివచ్చినవారిపై పిల్లలు, పెద్దలు అని చూడకుండా అందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టి బ్లీచింగ్ నీళ్లను చిమ్మిన సంగతి

తెలిసిందే. దీంతో వారికి కళ్లు, చర్మం మంటలు లేవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై కేరళ ఫైర్ సర్వీస్ అధికారులు స్పందించారు.

ఇదే పరిస్థితుల్లో తామూ జనాలపై స్ప్రే చేశామని, అయితే బ్లీచింగ్ కు బదులుగా సబ్బునీళ్లను స్ప్రే చేశామని ట్విట్టర్ లో అందుకు సంబంధించిన

వీడియోను పోస్ట్ చేశారు. పలుచోట్ల కేరళలో చేతులు కడుక్కునేందుకు బేసిన్లు కూడా ఏర్పాటు చేశారు.

For those questioning UP's move to spray disinfectant on migrants. Well, this video is from Kerala. Kerala Fire Service personnel spraying disinfectant on those who are entering the state.
Any thoughts on this ?
Video credits - @CjVarghese96 pic.twitter.com/5mWmG4OTm8
— Kushal Kumar Sinha (@KushalSinha001) March 30, 2020

logo