సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Apr 01, 2020 , 15:30:43

లాక్‌డౌన్‌లో గ‌ర్భిణులు ఇబ్బంది ప‌డుతున్నారా?

లాక్‌డౌన్‌లో గ‌ర్భిణులు ఇబ్బంది ప‌డుతున్నారా?

లాక్‌డౌన్‌లో సాధార‌ణ ప్ర‌జ‌లే ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో గ‌ర్భిణుల ప‌రిస్థితే దారుణం. ప‌దిరోజుల‌కు ఒక‌సారి హాస్పిట‌ల్‌కు వెళ్లి చెక‌ప్ చేయించుకునేవారు ఇప్పుడు ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఈ స‌మ‌యంలో మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురువుతున్నారు. వారికి ఇంట్లోవాళ్లు ఎంత ధైర్యం చెప్పినా శాటిస్‌ఫ్యాక్ష‌న్ ఉండ‌దు. ఎవ‌రు చెప్పేమాట‌లు వారే చెప్పాలి. అందుకే ఇంట్లోనే ఉంటూ డాక్ట‌ర్ల సూచ‌న‌లు ఇచ్చే స‌దుపాయం క‌ల్పిస్తున్న‌ది iMumz యాప్‌. 

ఇది యాప్ మాత్ర‌మే కాదు. ఈ పేరుతో యూట్యూబ్‌లో ఛాన‌ల్ కూడా ర‌న్ అవుతున్న‌ది.  ఇది ప్ర‌స్తుతం లాక్‌డౌన్ స‌మ‌యంలో గ‌ర్భిణుల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ద‌ని చెబుతున్నారు డాక్ట‌ర్ జ‌య‌దీప్ మ‌ల్హోత్రా. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె 10 వేల ఆప‌రేష‌న్లు చేసిన ఘ‌న‌త ఆమెకున్న‌ది. 


యాప్ ప్ర‌త్యేక‌త‌

దీనిని Puroo Health Tech Pvt Ltd లాంచ్ చేశారు. ఈ యాప్ గ‌ర్భిణుల‌కు మాత్ర‌మే. దీని ప్ర‌కారం క‌రోనా స‌మ‌యంలో 28 మిలియ‌న్ల మంది గ‌ర్భిణులున్నార‌ని తేలింది. వీరికి స‌రైన వైద్యం చేయ‌కుంటే డ‌యాబెటీస్‌, ఒబెసిటీ, బీపీ, క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌ల‌కు దారితీసే అవ‌కాశం ఉంది. ఇవి త‌ల్లికి ఉంటే బిడ్డ‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. త‌ల్లి, బిడ్డ క్షేమంగా ఉండాల‌నే ద్యేయంతో యాప్ ర‌న్ చేస్తున్నారు జ‌యదీప్ మ‌ల్హోత్రా. 2019లో లాంచ్ చేసినా లాక్‌డౌన్ స‌మ‌యంలో గ‌ర్భిణుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌తిరోజూ iMumz అనే ఛాన‌ల్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ పేరుతో ఒక సిరీస్ న‌డుస్తున్న‌ది. దీని ద్వారా మ‌హిళ‌ల‌కు కావాల్సిన స‌మాచారాన్ని అందిస్తున్నారు. 100కి పైగా ప్ర‌సిద్ధి చెందిన డాక్ట‌ర్లు దీనికోసం ప‌నిచేస్తున్నారు. అబ్‌స్ట్రాషియ‌న్స్‌, న్యూట్రిష‌నిస్ట్, యోగా, మాన‌సిక ఆరోగ్య నిపుణులు వంటి డాక్ట‌ర్లు ఈ బాధ్య‌త‌ను చేప‌ట్టారు. జ‌య‌దీప్‌తో క‌లిసి ర‌వితేజ అకోండియా, మ‌యూర్ అనే ఇద్ద‌రు ఐఐటీ వాళ్ల‌తో యాప్‌ను డెవ‌ల‌ప్ చేశారు. మెడిటేష‌న్ ఎక్స్‌ప‌ర్ట్ రాజేశ్ హ‌స్తం కూడా ఎంతో ఉంది. ప్ర‌తిరోజూ  ఉద‌యాన్నే  ఆరు నుంచి ఏడుమంది డాక్ట‌ర్లు మెడిటేష‌న్ సెక్ష‌న్లు ఏర్పాటు చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో యాప్ ద్వారా ప్ర‌తిరోజూ 200 మందికి పైగా మ‌హిళ‌ల‌కు ఉచితంగా చెక‌ప్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం 15000 యూజ‌ర్లున్నారు. వారానికి 1200 మంది కొత్త‌గా చేరుతున్నారు. వీళ్లంద‌రిలో క‌లిపి 2500 మంది రోజూ ఈ యాప్‌ని ఫాలో అవుతున్నారు. 

యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది >>     https://play.google.com/store/apps/details?id=com.pruoo.pruoo_app&hl=en_IN


logo