శుక్రవారం 05 మార్చి 2021
Health - Feb 23, 2021 , 17:37:35

ఫ్ర‌క్టోజ్ చ‌క్కెర‌లు రోగాల‌కు తెరుస్తాయి ద్వారాలు..!

ఫ్ర‌క్టోజ్ చ‌క్కెర‌లు రోగాల‌కు తెరుస్తాయి ద్వారాలు..!

హైద‌రాబాద్‌: ఫ‌్ర‌క్టోజ్ చ‌క్కెర‌లు మ‌నిషి వ్యాధినిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఫ్ర‌క్టోజ్ చ‌క్కెర‌ల‌ను అతిగా తీసుకోవ‌డంవ‌ల్ల అవి మ‌నలోని వ్యాధి నిరోధ‌క క‌ణాల‌లోని శ‌క్తిని న‌శింప‌జేస్తాయ‌ట‌. దాంతో దీర్ఘ‌కాలంలో మ‌నం సులువుగా వ్యాధుల బారినప‌డే ప్ర‌మాదం ఉంటుంద‌ట‌. యూనివ‌ర్సిటీ ఆఫ్ బ్రిస్ట‌ల్ శాస్త్ర‌వేత్త‌లు, లండ‌న్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్ర‌వేత్త‌ల‌తో క‌లిసి స్వాన్షియా శాస్త్ర‌వేత్త‌లు నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో ఈ విష‌యం వెల్ల‌డైంది. తాజాగా నేచ‌ర్ క‌మ్యూనికేష‌న్స్ జ‌ర్న‌ల్‌లో వారి అధ్య‌య‌నం ప్ర‌చురిత‌మైంది.

ఫ్ర‌క్టోజ్ వేటిలో ఉంటుంది..?

ఫ్ర‌క్టోజ్ చ‌క్కెర‌లు చ‌క్కెర‌ల‌న్నింటిలో కంటే అత్యంత తియ్య‌ని చ‌క్కెర‌లు. ఇవి సాధార‌ణంగా తియ్య‌ని పానీయాలు, స్వీట్లు, ఇత‌ర చ‌క్కెర‌ల‌తో త‌యారు చేసిన వివిధ తీపి ప‌దార్థాల్లో ఉంటాయి. తీపిగా ఉండే ఆహార ప‌దార్థాల ఉత్ప‌త్తి కోసం ఫ్ర‌క్టోజ్ చ‌క్కెర‌లను విరివిగా ఉప‌యోగిస్తుంటారు. ఈ ఫ్ర‌క్టోజ్ చ‌క్కెర‌లవ‌ల్ల‌ ఒబేసిటీ, టైప్-2 డ‌యాబెటిస్‌, నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. గ‌త కొన్నేండ్లుగా అభివృద్ధి చెందుతున్న ప్ర‌పంచంలో ఫ్ర‌క్టోజ్ వాడ‌కం విప‌రీతంగా పెరిగిపోయింది. అయితే, ఫ్ర‌క్టోజ్ చ‌క్కెర‌ల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే మ‌న వ్యాధినిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌నే విష‌యంలో ఇప్ప‌టికీ చాలామందికి స‌రైన అవ‌గాహ‌న ఉండ‌టం లేదు.

ఎలా ప్ర‌భావం చూపుతుంది..?

తాజా అధ్య‌య‌నం ప్ర‌కారం.. ఫ్ర‌క్టోజ్ చ‌క్కెర‌లు అతిగా తీసుకుంటే అవి మ‌న రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను క్ర‌మంగా న‌శింప‌జేస్తాయి. రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీనప‌డుతున్నా కొద్ది దాన్ని దెబ్బ‌తీసే కార‌కాలు మ‌రింత బ‌ల‌ప‌డుతాయి. దాంతో మన శ‌రీంలోని క‌ణాలను, క‌ణాజాలాలను దెబ్బ‌తీస్తాయి. దానివ‌ల్ల మ‌న ఒంట్లోని వివిధ అవ‌య‌వాలు, అవ‌య‌వ వ్య‌వ‌స్థ‌లు క్ర‌మం ప‌నిచేయ‌డం మానేస్తాయి. దాంతో మ‌నం రోగాల బారిన ప‌డుతాం. కాబ‌ట్టి ఫ్రక్టోజ్‌తో కూడిన అతి తీయ‌ని ప‌దార్థాల జోలికి వెళ్ల‌కుండా ఉండ‌టం చాలా మంచిది.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo