గురువారం 13 ఆగస్టు 2020
Health - Jul 16, 2020 , 17:23:26

పైనాపిల్‌లో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు

పైనాపిల్‌లో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు

వర్షాకాలం.. మరో వైపు  కరోనా వైరస్ ప్రభావం ఈ రెండింటి కలయిక మానవ జీవితాన్ని ఆందోళన కరంగా మార్చింది.  సాధారణ జ్వరం, టైఫాయిడ్, డెంగ్యూ మొదలైన వాటితో పాటు కరోనా సోకే ప్రమాదం కూడా ఉంది.  కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా చూసుకోవడం చాలా అవసరం.  ఇందుకోసం రోగనిరోధక శక్తిని పెంచడంపై దృష్టి పెట్టాలి.  చాలా మంది పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి  ప్రయత్నిస్తున్నారు.  డైట్‌లో వివిధ రకాల పండ్లు  క్రమం తప్పకుండా ఉండేలా చూసుకుంటున్నారు. 

కరోనా వైరస్ వ్యాప్తి  సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు పైనాపిల్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది.  పైనాపిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా,  ఎక్కువ శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్, విటమిన్-సి, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, మాంగనీస్ మొదలైనవి కూడా పుష్కలంగా ఉంటాయి.   ఎప్పుడూ జూస్‌ మాత్రమే కాకుండా పండు కూడా తినాలి. తాగడం వల్ల ఫైబర్ చాలా వరకు తగ్గుతుంది. విటమిన్లు, ఖనిజాలు,  ఎంజైమ్‌లు ఉండడం వల్ల  రోగనిరోధక శక్తిని పెంచేందకు పైనాపిల్ ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo