గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Jul 11, 2020 , 08:19:55

గుడ్లు, నిమ్మకాయలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు

గుడ్లు, నిమ్మకాయలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. ఇటు తెలంగాణలోనూ పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే సరైనా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చు అంటున్నారు వైద్యులు. కరోనా బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే మార్గం. అందుకోసం శరీరంలో ఇమ్యునిటీ పవర్‌ను పెంచుకోవడానికి సీ విటమిన్, ఐరన్‌ వంటివి అధికంగా ఉండే నిమ్మరసం, గుడ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. గతంలో వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించే నిమ్మకాయలు, కోడిగుడ్లు ఇప్పుడు నిత్యం వినియోగిస్తున్నారు.

దీంతో వాటికి భారీగా డిమాండ్ పెరిగింది. కొడిగుడ్ల ద్వారా మంచి ప్రోటీన్లు లభిస్తాయి. దీనిలో విటమిన్ ఏ, డీ ఐరన్ లాంటివి అధికంగా ఉండడం వల్ల ఇమ్యునిటీ పవర్‌ పెరుగుతుంది. సీ విటమిన్‌ పెంచుకోవడానికి నిమ్మకాయ చాలా మంచిదని వైద్యులు సూచించారు. మొత్తంగా కరోనా నుంచి రక్షించుకోవడానికి ప్రజలు పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo