గురువారం 13 ఆగస్టు 2020
Health - Jul 31, 2020 , 17:47:17

రాత్రులు, ప‌గ‌లు అదేప‌నిగా నిద్ర‌పోతే మ‌ధుమేహం‌ బారిన ప‌డ‌డం ఖాయం!

రాత్రులు, ప‌గ‌లు అదేప‌నిగా నిద్ర‌పోతే మ‌ధుమేహం‌ బారిన ప‌డ‌డం ఖాయం!

ఈ జెన‌రేష‌న్‌కు చెందిన వారెవ్వ‌రూ రాత్రులు స‌రిగా నిద్ర‌పోవ‌డం లేదు. ఫ‌లితంగా ప‌గ‌లు నిద్ర‌పోతున్నారు. రాత్రులు మేల్కొని ప‌గ‌లు నిద్రిస్తున్నారు. ప‌గ‌లు అతిగా నిద్ర‌పోతే మ‌ధుమేహం బారిన ప‌డ‌డం ఖాయం అని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

* ప‌గ‌టి పూట నిద్రించేవారు షుగ‌ర్ బారిన ప‌డ‌డంతోపాటు అధిక బ‌రువు పెర‌గానికి కూడా దారితీస్తున్న‌ది. అంతేకాదు బోన‌స్‌గా త‌ల‌నొప్పి, గుండె నొప్పులు, క్యాన్స‌ర్‌, అర్థ‌రైటిస్ వంటి వ్యాధుల వ్యాధుల‌ను కొని తెచ్చుకుంటారు.

* పగటిపూట నిద్రతో మధుమేహం తప్పదని పరిశోధనలో తేలింది. పగటి పూట నిద్రించే వారికి డయాబెటిస్, బరువు పెరగడం, గుండె జబ్బులు, తలనొప్పి, క్యాన్సర్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. 

* కాబ‌ట్టి రాత్రిపూట కంటికి స‌రిప‌డా నిద్రపోయేవారు పగటి పూట నిద్రపోవడం వీలైనంత వ‌ర‌కు దూరం చేసుకుంటే మంచిది. రాత్రిపూట స‌రిగ్గా నిద్ర‌పోయే వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు ద‌రిచేర‌వు. 

* నైట్‌షిఫ్ట్ చేసే వారి ఆరోగ్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వీరిని ఒబిసిటీ వేధిస్తుంద‌ని చెబుతున్నారు. రాత్రులు ప‌డుకునే ముందు కంప్యూట‌ర్లు, సెల్‌ఫోన్లును దూరం పెట్టాలి. 

* అందుకే ప్ర‌తిరోజూ 8 గంట‌లు నిద్ర‌పోయేలా చూసుకోవాలి. కొన్నిసార్లు టైం అటూ ఇటూ అయినా మ‌రుస‌టి రోజు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. 

* రాత్రి స‌మ‌యంలో హెవీ ఫుడ్ తిన‌కుండా తేలిక‌గా ఉంచే ఆహారాన్ని తీసుకోవాలి. స్పైసీ ఫుడ్‌, ఫాస్ట్ ఫుడ్‌, బిర్యానీ, పిజ్జా, చీజ్‌, ఐస్‌క్రీంల‌కు దూరంగా ఉంటే మంచిది. తేలికైనా ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంది.  

* టీ, కాఫీలు ఎక్కువ‌గా తాగేవారికి కూడా నిద్ర‌ప‌ట్ట‌దు. అందులో ఉండే కెఫిన్ నిద్ర‌కు భంగం క‌లిగిస్తుంది. వీటికి బ‌దులు వేడిపాల‌ల్లో కాస్త ప‌సుపు, తేనె వేసుకొని కలుపుకొని తాగితే హాయిగా నిద్ర‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

 


logo