ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Aug 20, 2020 , 22:17:51

దానిమ్మ ప్రయోజనాలు తెలిస్తే.. మీరిక వదిలిపెట్టరు..

దానిమ్మ ప్రయోజనాలు తెలిస్తే.. మీరిక వదిలిపెట్టరు..

హైదరాబాద్‌: ప్రతి సీజన్‌లోనూ కనిపించే దానిమ్మ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. ఇది మన దేశంలో విరివిగా లభిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో చిత్రదుర్గ జిల్లాలో ఎక్కువ సాగయ్యే ఈ పండును ఇష్టపడని వారుండరు. తెలంగాణా రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోని షోలాపూర్‌, నాగ్‌పూర్‌లో కూడా దీన్ని ఎక్కువగా సాగుచేస్తారు. మనదేశంనుంచే వివిధ దేశాలకు ఈ ఫలం ఎగుమతి అవుతోంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు ఏ, సీ ఈ, బీ5తోపాటు ఫ్లేవనాయిడ్స్‌‌ ఉంటాయి. ఇందులో అనేక ఔషధ గుణాలున్నాయి. 

  • ఇది యాంటీఆక్సిడెంట్ల సమాహారం 
  • కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్యం రాకుండా చేస్తుంది.
  • అల్జీమర్స్‌, రొమ్ము, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటుంది. 
  • ఇది సహజ ఆస్పిరిన్‌లా పనిచేస్తుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.
  • రోజుకో గ్లాస్‌ దానిమ్మరసం తాగితే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
  • దానిమ్మ వయాగ్రాలా పనిచేస్తుంది. అంగస్థంభనతో బాధపడుతున్నవారికి ఇది సరైన ఔషధం.
  • సంతానసాఫల్యతను పెంచే శక్తి దీనికి ఉంది. 
  • ఇందులో ఫోలిక్ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. గర్భస్థ శిశువుల ఎదుగుదలకు సహాయపడుతుంది.
  • దీనిని గర్భిణులు క్రమంతప్పకుండా తీసుకుంటే నెలలు నిండకుండానే ప్రసవమయ్యే ముప్పుకూడా తప్పుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
  • ఇందులో విటమిన్‌ సీ ఉండడం వల్ల నోటిపూతనుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo