డ‌యాబెటిస్ ఉందా..? క‌్యాప్సికం తినండి..!


Sat,May 4, 2019 03:05 PM

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ జీవ‌న‌విధానంలో అనేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు ఆహారం విష‌యంలోనూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ముఖ్యంగా కార్బొహైడ్రేట్లను తీసుకోవ‌డం త‌గ్గించాలి. వాటి స్థానంలో తాజా పండ్లు, కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. అలాగే క్యాప్సికంను కూడా వారు రోజూ ఆహారంలో తీసుకుంటే దాంతో షుగర్ పూర్తిగా నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

క్యాప్సికంలో ఆల్ఫా గ్లూకోజైడేజ్‌, లైపేజ్ అనే రెండు ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కార్పొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే ప్ర‌క్రియ‌ను నెమ్మ‌దింప‌జేస్తాయి. దీంతో కార్బొహైడ్రేట్ల‌ను తిన్న వెంట‌నే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి. అలాగే క్యాప్సికంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని త‌గ్గిస్తాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను క‌లిగిస్తాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి స‌హ‌జంగానే ఒత్తిడి స్థాయిలు అధికంగా ఉంటాయి. క‌నుక ఒత్తిడి త‌గ్గాలంటే.. క్యాప్సికంను తినాలి. అలాగే క్యాప్సికం తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది..!

3602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles