ఆదివారం 17 జనవరి 2021
Health - Nov 30, 2020 , 21:15:40

ప్రకృతికి దగ్గరగా ఉంటే మానసిక సమస్యలు రావట..

ప్రకృతికి దగ్గరగా ఉంటే మానసిక సమస్యలు రావట..

హైదరాబాద్ : ప్రకతిని మనం ప్రేమిస్తే.. అది మనల్ని ప్రేమిస్తుందంటారు. అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండే వారు మరింత ఆరోగ్యంగా ఉంటారని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. పచ్చదనం మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని, మానసికంగా బాగా కుంగిపోయిన వారు సైతం.. పచ్చని ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే త్వరగా కోలుకుంటారని తేలింది. 

జర్నల్ ఆఫ్‌ ఎకలాజికల్ అప్లికేషన్స్‌లో ప్రచురించిన ఈ కథనం ప్రకారం.. జపాన్ రాజధాని టోక్యోలో 3 వేల మందిపై ఓ సర్వే నిర్వహించారు. వీరిలో (నిరుత్సాహం, జీవితంపై అసంతృప్తి,  స్వయంగా కించపరుచుకోవడం, ఒంటరితనం) వంటి సమస్యలను గురించారు.  అదేవిధంగా పచ్చదనానికి దగ్గరగా ఉండే వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వీరంతా.. ఇంటి కిటికీల్లో నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని పచ్చదనాన్ని,  ప్రకృతిని ఆస్వాదించి.. వారికున్న  మానసిక బాధ, అసంతృప్తి, స్వతహాగా కించపరచుకోవడం, నిరుత్సాహం, ఒంటరితనం లాంటి మానసిక సమస్యలకు దూరమవుతున్నట్లు గుర్తించారు.

ప్రకృతికి దగ్గరగా ఉంటే మనుషుల్లో మానసిక ఒత్తిడి చాలా వరకూ తగ్గుతుందని నిపుణులు తేల్చారు. అందుకే..  ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కచ్చితంగా కాపాడుతుందని మరోసారి రుజువైందని అధ్యయనాలు చెబుతున్నాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని సహజమైన ప్రకృతిని కాపాడుకోవడం మానవాళికి చాలా ముఖ్యమని,  అలా చేయడం వల్ల మనుషుల ఆరోగ్యంలో చాలామార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.