శనివారం 24 అక్టోబర్ 2020
Health - Sep 26, 2020 , 17:13:41

డైనింగ్ టేబుల్ మీద పెద్ద పాత్ర‌లుంటే వెంట‌నే తీసేయండి! లేదంటే..

డైనింగ్ టేబుల్ మీద పెద్ద పాత్ర‌లుంటే వెంట‌నే తీసేయండి! లేదంటే..

టేబుల్ మీద పెద్ద పాత్ర‌లుంటే ఏమ‌వుతుంది అని సందేహిస్తున్నారా? మ‌రేం లేదు పెద్ద పాత్ర‌లుంటే వాటి సైజులోకి మ‌నం కూడా మారిపోతాం. అంటే లావైపోతాం అంటున్నారు ప‌రిశోధ‌కులు. ఈ మాట విన‌డానికి త‌మాషాగా ఉన్నా నిజం. ప‌రిశోధ‌న చేసిన త‌ర్వాత బ‌య‌ట ప‌డిన విష‌యం. పాత్ర‌ల‌కు, లావుకు సంబంధం ఏంటంటే.. పెద్ద పాత్ర‌లుంటే తినాల్సిన దానికంటే ఎక్కువ తినాల‌నిపిస్తుంది. అదే చిన్న సైజులో పాత్ర‌లు ఉంటే మ‌న ఆలోచ‌న కూడా త‌క్కువ తినాల‌నే ఉంటుంది.

6,711 మందిపై కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న జ‌రిపారు. కేవ‌లం పాత్ర‌ల ప‌రిమాణం కార‌ణంగా ఎక్కువ తింటున్నార‌ని పేర్కొన్నారు. పాత్ర‌ల ప‌రిమాణం త‌గ్గించ‌డం వ‌ల్ల బ్రిట‌న్‌లో 16 శాతం, అమెరికాలో 20 శాతం మందిని ఊబ‌కాయం బారిన ప‌డ‌కుండా కాపాడ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. కొంత‌మంది ఆహారం తిన్న త‌ర్వాత తీపి ప‌దార్థాలు, పానీయాలు ఎక్కువ‌గా తీసుకుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల గుండెజ‌బ్బులు, డ‌యాబెటిస్‌, ఊబ‌కాయం వంటి స‌మ‌స్య‌లకు గుర‌వుతున్నారు. ఇవ‌న్నీ కంట్రోల్ ఉండాలంటే ముందుగా చేయాల్సిన ముఖ్య‌మైన ప‌ని పాత్ర‌ల సైజు త‌గ్గించ‌డ‌మే.


logo