ఒక చిన్న హగ్ జీవితాన్ని మార్చేస్తుంది!


Mon,April 3, 2017 01:48 PM

చిన్న పిల్లలను పెంచడం ఎంత కష్టమో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్లు పెరిగి పెద్దయ్యాక వారి జీవితంలో వచ్చే మార్పులు ఆ కుటుంబానికి, సమాజానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటాయి.

చిన్న పిల్లలున్న ఇల్లు ఎంతో కలకలలాడుతుంటుంది. పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు వారిని ఎంతో ప్రేమగా, అప్యాయంగా చూసుకోవాలి. వారికి సరైన ఆహారం అందివ్వాలి. అప్పుడే వారి శారీరక, మానసిక ఎదుగుదల సరిగ్గా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటన్నిటితో పాటు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు ప్రేమగా కౌగిలించుకోవడం కూడా ఎంతో ముఖ్యమంటున్నారు నిపుణులు. ఒక ఐడియా జీవితాన్ని మర్చినట్లు ఒక హగ్ చిన్న పిల్లల జీవితంలో ఎన్నో మార్పులకు దోహదం చేస్తుందంటున్నారు.

పిల్లల్నే కాదు బాదలో ఉన్న పెద్దవారిని సైతం హగ్ చేసుకుంటే వారికి మానసిక ధైర్యం వస్తుందంటున్నారు. పిల్లలకు అప్యాయంగా ఇచ్చే కౌగిలింత వారితో తల్లదండ్రులకు ద్రుఢమైన అనుబంధం ఏర్పడుతుంది. పిల్లలు మానసికంగా ఎంతో ఉల్లాసంగా తయారవుతారు. దీంతో వారికి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఎదుగుదల కూడా సక్రమంగా ఉంటుందని పరిశోధనలు సైతం రుజువు చేశాయి. పిల్లలను తల్లి ప్రేమగా హగ్ చేసుకున్నపుడు వారిలో ఆక్సిటోసిన్ అనే హర్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మనిషిలో సంతోషాన్ని కలగజేస్తుంది. అందుకే దీన్ని హ్యపీ హర్మోన్ అని పిలుస్తారు. అందుకే తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్న వీలైనప్పుడల్లా పిల్లలను కనీసం 20 సెకండ్లపాటు హగ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

3899

More News

VIRAL NEWS