గురువారం 03 డిసెంబర్ 2020
Health - Sep 29, 2020 , 18:38:41

తేనె తింటే కంటిచూపు మెరుగుప‌డుతుందా?

తేనె తింటే కంటిచూపు మెరుగుప‌డుతుందా?

కంటిచూపు మెరుగుప‌డ‌టానికి తేనె ఒక వ‌రం అని తెలుసా?  తేనె రుచిని ఇవ్వ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి, చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాదు బ‌రువు త‌గ్గానికి కూడా ఎంతో తోడ్ప‌డుతుంది. డ‌యాబెటిస్‌ చికిత్స‌కు కూడా తేనె వాడుతారు. కానీ తేనె క్ర‌మం త‌ప్ప‌కుండా ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు ఏం జ‌రుగుతుందో తెలుసా? ఇది దృష్టిని మెరుగుపరచడానికి మాత్రమే కాదు, ఈ తీపి ద్రవం కంటివాపును తగ్గించ‌డంలో అద్భుతమైన టానిక్‌లా ప‌నిచేస్తుంది. కళ్ళలో చికాకు, మంట‌తో బాధపడుతుంటే తేనె సరైన పరిష్కారం. తేనె వ‌ల్ల క‌లిగే మ‌రిన్ని ప్ర‌యోనాలు తెలుసుకోండి. 

కంటి వ్యాధులు  

తాజా తేనె కంటి రుగ్మతలకు ఉత్తమ ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.కంటి వ్యాధులైన బ్లీఫరోకాన్జుంక్టివిటిస్, ఇన్ల్ఫ‌మేటరీల‌కు బాగా ప‌నిచేస్తుంది. మ‌స‌కబారడం వంటి కంటి సమస్యలకు తేనె ఉత్తమ ఎంపిక. ‌

క‌ళ్ల‌కు రీఫ్రెష్‌

కంప్యూటర్ ముందు గంట‌ల త‌ర‌బ‌డి కూర్చునేవారి క‌ళ్లు అలసిపోతాయి. ఇందుకు తేనె తోడ్ప‌డుతుంది. మూసిన కనురెప్పల మీద తేనె వేసి కాసేపు పాటు అలానే వ‌దిలేయాలి. అప్ప‌టివ‌ర‌కు సంగీతం వింటూ విశ్రాంతి తీసుకుంటే బెట‌ర్‌. అర‌గంట త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో శుభ్ర‌ప‌రుచుకుంటే క‌ళ్లు రీఫ్రెష్ అవుతాయి.

క‌న్ను పొడిబార‌డం

చ‌ర్మం పొడిబార‌డిన‌ట్లుగానే క‌ళ్లు కూడా పొడిబారుతాయి. అలాంట‌ప్పుడు ఏడ్చినా కూడా క‌న్నీళ్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌లేదు. క‌న్ను పొడిబారిన‌వారిలో నొప్పి, దురద, క‌న్ను ఎర్రబడటం, దృష్టి మసకబారడం వంటి అనేక లక్షణాలను ఎదుర్కొంటారు. ఇలా ఉన్న‌ప్పుడు తేనె, గోరువెచ్చ‌ని నీటితో ఐవాష్ త‌యారు చేసి క‌ళ్ల‌ను బాగా క‌డుగాలి. రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది.   

దృష్టి లోపం

వయసు పెరిగే కొద్దీ దృష్టి బలహీన ప‌డుతుంది. ఈ అస్పష్టమైన దృష్టి మాక్యులార్ డీజెనరేషన్‌తో ముడిపడి ఉంటుంది. దీనిని తేనె సహాయంతో సులభంగా నివారించవచ్చు. తేనెలో యాంటీఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఇవి కంటి కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి, 25 నుంచి 50 ఏండ్ల మ‌ధ్య వయస్సులో ఉన్న‌వాళ్లు క్ర‌మం త‌ప్ప‌కుండా తేనె వాడటం వల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది.

కండ్లకలకను నయం చేస్తుంది

ఎప్పుడొక‌సారి ప్ర‌తిఒక్క‌రూ కండ్ల‌క‌ల‌క‌కు గుర‌వుతాయి. అది వ్యాపించకుండా నిరోధించడానికి స‌న్‌గ్లాసెస్ ధరించవలసి వస్తుంది. చిన్న పిల్లలలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. వీరికి కళ్లు దుర‌ద పెట్ట‌డంతో ఆందోళ‌న చెందుతారు. కండ్ల‌క‌ల‌క‌ను సమర్థవంతంగా నయం చేయ‌డానికి తేనె ఎంతో తోడ్ప‌డుతుంద‌ని అనేక అధ్య‌య‌నాలు సూచించాయి.

కంటి ముడుతలు

తేనె కంటి రుగ్మతలకు చికిత్స చేయడమే కాకుండా, కళ్ళ చుట్టూ ముడతలు, గీతలను తగ్గించడంలో ఏంతో అద్భుతంగా ప‌నిచేస్తుంది. మూసిన కళ్ళపై కొంచెం తేనె వేసి, 15 నిమిషాల‌పాటు విశ్రాంతి తీసుకోవాలి. త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో కడిగేయాలి.   

కంటి ఇన్ఫెక్షన్  

కంటి ఇన్ఫెక్షన్ కోసం ఎప్పుడైనా తేనెను ఉపయోగించారా? బ్యాక్టీరియా, వైరస్ లేదా ఇతర సూక్ష్మజీవుల వల్ల సంభవించిన‌ అన్ని రకాల కంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి తేనె ఉత్తమమైన ఔషధంగా ప‌నిచేస్తుంద‌ని చెప్పవచ్చు. తేనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది కంటి ఇన్ఫెక్షన్ల నివారణకు ప‌నిచేస్తుంది. 

చేయవలసిందల్లా ఒక‌టే.. సమాన పరిమాణంలో తేనె, వేడినీటిని బాగా క‌లుపాలి. దూదిపింజ‌ల‌ సహాయంతో ఈ మిశ్ర‌మాన్ని కంటికి అప్లై చేయాలి. ఇలా చేస్తే కంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.