ఆదివారం 09 ఆగస్టు 2020
Health - Jul 16, 2020 , 16:30:33

శానిటైజ‌ర్ వాడుతున్నారు స‌రే.. దాన్ని ఎప్పుడైనా టెస్ట్ చేశారా?

శానిటైజ‌ర్ వాడుతున్నారు స‌రే.. దాన్ని ఎప్పుడైనా టెస్ట్ చేశారా?

ఇప్పుడు మార్కెట్‌లో గిరాకీ ఉండే ప్రొడ‌క్ట్ శానిటైజ‌ర్‌. క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు చేతుల‌కు శానిటైజ‌ర్ వాడుతూ ఉండాలి. అలానే ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి. మ‌రి మార్కెట్లో కొనుగోలు చేసే శానిటైజ‌ర్ మంచిదా కాదా అని ఎప్పుడైనా సందేహం వ‌చ్చిందా. అన్ని ప్రాడ‌క్ట్స్‌లో క‌ల్తీ ఉన్న‌ట్లే.. శానిటైజ‌ర్‌ను కూడా క‌ల్తీ చేస్తున్నారు. మ‌రి క‌ల్తీ శానిటైజ‌ర్ వాడితే ఆరోగ్యానికి ముప్పే క‌దా. అందుక‌ని మీరు కొనే ప్ర‌తి శానిటైజ‌ర్ బాటిల్‌ని ఈ విధంగా చెక్ చేసుకోండి.

గోధుమపిండి ప‌రీక్ష :

ఒక ప్లేట్ తీసుకొని టేబుల్‌స్పూన్ గోధుమ‌పిండి తీసుకోవాలి. గోధుమ‌పిండి లేక‌పోతే వేరే ఏ పిండి అయినా తీసుకోవ‌చ్చు. కొనుగోలు చేసిన శానిటైజ‌ర్‌ను ఒక టేబుల్‌స్పూన్ తీసుకొని పిండిలో క‌లుపాలి. అలా అని ఎక్కువ తీసుకోకూడ‌దు. ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. శానిటైజ‌ర్‌లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటే ఈ మిశ్ర‌మం చ‌పాతీ పిండిలా త‌యార‌వుతుంది. అదే ఆల్కాహాల్ గ‌నుక ఎక్కువ‌గా ఉంటే అది పిండి పిండిగానే ఉంటుంది. ఎంత క‌లిపినా చ‌పాతీ పిండిలా మార‌దు. మొత్తానికి వేసిన శానిటైజ‌ర్ ఆరిపోతుంది.

ఇలా ప‌నిచేస్తుంది?

ఈ టెస్ట్ అనేది సింపుల్ ఫ్యాక్ట్ తో పనిచేస్తుంది. అదేంటంటే, పిండికి నీరు తోడైతే గ్లూటెన్ తో పాటు కార్బోహైడ్రేట్స్ అనేవి ఉబ్బుతాయి. దాంతో, చపాతీ పిండిలా తయారవుతుంది. మరోవైపు, ఆల్కాహాల్ అనేది గ్లూటెన్ అలాగే కార్బోహైడ్రేట్స్‌తో పోరాడుతుంది. వాటిని హైడ్రేట్ అవనివ్వదు. దాంతో, అవి జిగురుగా మారవు. కాబట్టి, పొడిలాగానే మిగిలిపోతుంది. ఈ టెస్ట్ అనేది అత్యంత సున్నితమైనది. అరవై శాతం లేదా అంతకంటే తక్కువ ఆల్కాహాల్ కంటెంట్ ఉన్న శాంపిల్స్‌ను ఈ టెస్ట్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు.
logo