శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Jun 19, 2020 , 19:11:45

ఆ స‌మ‌యంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా? అయితే జాగ్ర‌త్త‌!

ఆ స‌మ‌యంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా? అయితే జాగ్ర‌త్త‌!

పీరియ‌డ్స్ స‌మ‌యంలో ఐదు రోజుల పాటు మ‌హిళ‌లు న‌ర‌క‌యాతన అనుభ‌విస్తారు. కొంత‌మందికి భ‌యంక‌రంగా బ్లీడింగ్ అవుతుంటుంది. అలాంట‌ప్పుడు బ‌య‌ట‌కి వెళ్లాల‌న్నా సంకోచిస్తుంటారు. ఉద్యోగం చేసే మ‌హిళ‌ల‌కు ఇది పెద్ద స‌మ‌స్యే. పీరియడ్స్‌లో బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా, పీరియడ్ కీ పీరియడ్ కీ మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నా, ఎక్కువగా నీరసంగా ఉన్నా డాక్టర్‌ని సంప్రదించాలి. స‌మ‌స్య‌ను అదుపులో పెట్టుకోవ‌చ్చు అంటే అది కేవ‌లం ఆహార‌పు అల‌వాట్ల ద్వారానే అంటున్నారు వైద్యులు. అదెలాగంటే..  

పోష‌క విలువ‌లున్న పండ్లు : 

విట‌మిన్ 'సి'లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది గ‌నుక ఉంటే ఎనీమియా రాకుండా ఉంటుంది. అయితే విట‌మిన్ సి అనేది నిమ్మ‌జాతి పండ్ల‌లో ఎక్కువ‌గా ఉంటుంది. వీటితోపాటు క్యాప్సిక‌మ్‌, కివీ, స్ట్రాబెర్రీస్‌, బ్ర‌కోలీ, ట‌మాట‌ల‌లో కూడా విట‌మిన్ సి ఉంటుంది.

నీరు బాగా తాగాలి :

ఆరోగ్యం బాగా ఉన్న‌ప్ప‌టికీ నీళ్లు ఎక్కువ‌గా తాగుతుండాలి. పీరియ‌డ్స్‌లో ర‌క్త‌స్రావం ఎక్కువ‌గా ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే రోజూ తాగే నీటికంటే నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీరు ఎక్కువ తాగాలి. దీంతోపాటు ఉప్పు కూడా ఎక్కువ‌గా తీసుకోవాలి. 

ఐర‌న్ త‌గ్గుతుంది :

పీరియ‌డ్స్ టైంలో బాడీ ఐర‌న్‌ను కోల్పోతుంది. ఐర‌న్ త‌గ్గిపోవ‌డం వ‌ల్ల ఎనీమియాలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతో క‌ళ్లు తిర‌గ‌డం, నీర‌సంగా ఉండ‌డం, శ‌రీరం పాలిపోవ‌డం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఎనీమియా రాకుండా ఉండాలంటే ఆయిస్ట‌ర్స్‌, చికెన్‌, బీన్స్‌, పాల‌కూర ఎక్కువ‌గా తీసుకోవాలి.  

విట‌మిన్ సి బ్లీడింగ్‌ను తగ్గిస్తుంది.పైగా అది మీ బాడీ ఐరన్‌ని అబ్జార్బ్ చేసుకోడానికి సహకరిస్తుంది. ఐరన్ లోపం వల్ల కూడా హేవీ పీరియడ్స్ రావొచ్చు. కాబట్టి ఐరన్ సప్లిమెంట్స్ ఈ విషయంలో హెల్ప్ చేస్తాయి. చేయి దాటి పోతుంది అనిపించిన‌ప్పుడు డాక్ట‌ర్‌ను క‌న్స‌ల్ట్ అవ్వాలి.logo