ఉల్లిపాయలను తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..


Sat,October 13, 2018 09:14 AM

ఉల్లిగడ్డ లేకుండా కూర చెయ్యడానికి ఎవరూ ఇష్టపడరు. ఇష్టమైన వాటిని తరిగేటప్పుడు కష్టపడుతుంటారు. ఉల్లిగడ్డలు తరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది.

*ఉల్లిగడ్డలు తరిగే ముందు సగానికి కోసి నీటిలో వేయాలి. ఇలా చేస్తే కోసేటప్పుడు కంట్లో నీళ్లు రావు.
*గాలి బాగా ప్రసరించే ప్రదేశంలోనే ఉల్లిగడ్డలను తరుగాలి. అంటే.. ఇంట్లో ఫ్యాన్ కింద కాకుండా వంటగదిలో ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ దగ్గరలో నిల్చుని తరుగడం వల్ల కళ్లు మండకుండా ఉంటాయి.
*ఉల్లిగడ్డలు కోసేముందు కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉల్లిగడ్డలోని ద్రవరూపంలో ఉన్న రసాయనాలు గడ్డకడుతాయి. ఇలా చేయడం వల్ల ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంటి నుంచి నీళ్లు రాకుండా ఉంటాయి.
*ఉల్లిగడ్డలు కోసిన తరువాత గిన్నెలో వేయకుండా చాపింగ్ బోర్డ్ మీదే ఉంచాలి. దీనివల్ల రసాయనాలు తక్కువగా విడుదలవుతాయి.
*ఉల్లిగడ్డలను కోసే ప్రదేశంలో కొవ్వొత్తి వెలిగించినా, మండుతున్న గ్యాస్ దగ్గరగా నిలబడి తరిగినా కళ్లు మండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

6058

More News

VIRAL NEWS