ఉల్లిగడ్డ కోసేపుడు కళ్లు మండకుండా ఉండాలంటే..


Wed,June 6, 2018 08:37 PM

ఎంతటివారైనా ఉల్లిగడ్డ కోస్తున్నారంటే కళ్ల నీళ్లు పెట్టుకోవాల్సిందే! ఉల్లిగడ్డలోని సల్ఫర్ వల్ల వాటిని కోసేటప్పుడు కళ్లు మండుతాయి.ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే..

* ఉల్లిగడ్డను కోసేటప్పుడు దాంట్లోని ఎంజైమ్స్ గాలిలోకి విడుదలై కళ్లను మండిస్తాయి. ఇలా జరుగకుండా ఉండాలంటే ఉల్లిగడ్డను పదునైన కత్తితో వీలైనంత త్వరగా తరుగాలి.
* ఉల్లిగడ్డ కోసేముందు కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీనివల్ల ఎంజైమ్స్ ప్రభావం తగ్గుతుంది.
* కళ్లకు టైట్ గాగుల్స్ లేదా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నా సరిపోతుంది. గాలి చొరబడని స్విమ్మర్ గాగుల్స్ అయితే మరింత బెటర్.
* కిటికీ లేదా ఫ్యాన్‌కి దగ్గరగా కూర్చొని ఉల్లిగడ్డలను కట్ చేయాలి. ఇలా చేస్తే గాలికి ఉల్లి నుంచి వెలువడే ఎంజైమ్స్ కళ్లకు చేరకుండా ఉంటాయి.

9215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles