చలికాలంలో 'చర్మ సంరక్షణ' ఇలా..!


Sat,January 2, 2016 06:11 PM

చలికాలం వచ్చిందంటే చాలు మనందరం చర్మాన్ని సంరక్షించుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతుంటాం. ఈ కాలంలో చర్మం తెల్లగా పొడిబారడమే కాకుండా అది మనల్ని ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే చర్మ సంరక్షణ ఒక్కోసారి కష్టంగా మారుతుంది. అయితే కింద ఇచ్చిన పలు సూచనలను పాటిస్తే అధిక శాతం వరకు చర్మాన్ని చలి బారి నుంచి రక్షించుకోవచ్చు. ఆ సూచనలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. నువ్వుల నూనె చలికాలంలో బాగా పనిచేస్తుంది. శరీరానికి ఈ నూనె పట్టించి సున్ని పిండితో రుద్ది వేడి నీళ్ల స్నానం చేస్తే చర్మం సున్నితంగా మారుతుంది.

2. వాజలీన్ లేదా ఇతర ఏదైనా బాడీ లోషన్‌ను రాసుకుని గోరు వెచ్చని నీటి స్నానం చేయాలి. దీంతో శరీరం మృదువవుతుంది.

3. స్నానం చేసే నీటిలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి వేడి నీటి స్నానం చేయాలి. ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

4. ఉదయాన గోరువెచ్చని నీటితో స్నానం చేసిన తరువాత ముఖానికి తప్పనిసరిగా క్రీమ్ రాసుకోవాలి. విటమిన్ ఇ ఉన్న క్రీమ్స్ వాడడం మంచిది.

5. ఈ కాలంలో వచ్చే పగుళ్లకు లైట్ మాయిశ్చరైజర్‌కి బదులుగా థిక్ క్రీమ్‌ను ఉపయోగించాలి. సాధారణ సబ్బులకు బదులు గ్లిజరిన్ సబ్బులు వాడాలి.

6. రాత్రి పడుకునే ముందు చేతులు, కాళ్లకు వాజలీన్ రాసుకుంటే మంచిది. వారానికి ఒక సారైనా హాట్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవాలి.

7. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడం మూలంగా ఎక్కువ నీరు తాగం. కానీ నీటిని కూడా తగినంత ఎక్కువగా తీసుకుంటేనే ఈ కాలంలోనూ చర్మం పొడిబారకుండా ఉంటుంది.

3759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles