శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - May 26, 2020 , 16:00:27

పిల్లలను ఫిట్‌నెస్‌ వైపు ఎలా మోటివేట్‌ చేయాలి?

పిల్లలను ఫిట్‌నెస్‌ వైపు ఎలా మోటివేట్‌ చేయాలి?

సాధారణంగా పిల్లలు గ్రౌండ్‌లో, రోడ్డు మీద ఎంతసేపు ఆడమన్నా ఆడుతారు కాని ప్రత్యేకంగా వ్యాయామాలు చేయమంటే మాత్రం బుక్‌ పట్టుకొని చదవమన్నట్లు ఫీలవుతారు. కారణం వారికి  ఎక్స్‌ర్‌సైజ్‌ అంటే బోరింగ్‌గా ఉంటుంది కాబట్టి. అందుకే పిల్లల్ని ఫిట్‌నెస్‌వైపు మోటివేట్‌ చేయడానికి వినూత్న పద్దతి కనిపెట్టారు.

దీనికి జిమ్ అవసరం లేదు. పెద్ద గ్రౌండ్‌ అసలు అవసరం లేదు. ఇంటి టెర్రస్‌ మీద ఖాళీ ప్రదేశం ఎలాగూ ఉంటుంది. దీన్నే జిమ్‌ ప్రదేశంగా మలుచుకున్నారు. చాక్‌పీస్‌ తీసుకొని జంప్‌‌, లాంగ్‌జంప్‌, పుషప్స్‌, రన్నింగ్‌, స్కిప్పింగ్‌, వాకింగ్‌ లాంటి వర్కౌట్స్‌ సింబల్స్‌ను గీశారు. అన్నీ ఒకేసారి చేయకుండా మధ్య మధ్యలో పిల్లలకి ఉత్సహాన్నిచ్చే జంపింగ్ గుర్తులు కూడా గీశారు. స్టార్టింగ్‌ నుంచి ఫినిషింగ్‌ వరకు అన్నీ వర్కౌట్స్‌ ఇందులో ఉన్నాయి. ఎ,బి,సి,డి.. 1,2,3 నెంబర్లతో కొంచెం ఆసక్తిగా ఉండడంతో పిల్లలు ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. ఇవన్నీ లైన్‌లో ఎంత చక్కగా గీశారో ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా మీ పిల్లల్ని కూడా మోటివేట్‌ చేయండి. 


logo