మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Jul 28, 2020 , 16:13:27

ఈ అల‌వాట్లు ఉంటే చాలు.. ఏం చేయ‌క‌పోయినా బ‌రువు త‌గ్గిపోతారు!

ఈ అల‌వాట్లు ఉంటే చాలు.. ఏం చేయ‌క‌పోయినా బ‌రువు త‌గ్గిపోతారు!

నాలుగు నెల‌ల లాక్‌డౌన్‌తో బ‌క్క‌పీచులా ఉండేవాళ్లు కూడా లావైపోయారు. కార‌ణం చేసుకోవ‌డం, తిన‌డం. వ‌ర్క‌ఫ్రంహోమ్ వాళ్ల‌కైతే తిన‌డం, కూర్చోని ప‌నిచేసుకోవ‌డం. ఇలా అయితే తిన్న క్యాల‌రీల‌న్నీ ఎప్పుడు క‌రుగుతాయి. అలా క‌ర‌గ‌క‌పోయేస‌రికే  క‌దా శ‌రీరంలో ఫ్యాట్ ఏర్ప‌డుతుంది. ఒక్క‌సారిగా లావైపోయార‌ని ఇప్పుడు క‌స‌ర‌త్తుల‌తో బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారు. ఒక్క‌సారిగా అంత క‌ష్ట‌ప‌డినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అందుకే సింపుల్‌గా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ స‌ల‌హా ప‌నికి వ‌స్తుంది. కొన్ని ప‌నులు అల‌వాట్లుగా మార్చుకుంటే చాలు. ఏం చేయ‌క‌పోయినా బ‌రువు త‌గ్గిపోతారంటున్నారు. మ‌రి ఆ అల‌వాట్లు ఏంటో తెలుసుకోండి. 

క‌ప్పు పండ్లు : ఎక్కువ క్యాల‌రీలు ఉండే ఆహారం కాకుండా.. చేసే ప‌నులు బ‌ట్టి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అంటే ఆ క్యాల‌రీలు బ‌ర్న్ అవుతాయి అనుకుంటేనే తినాలి. దీనివ‌ల్ల శ‌రీరం తేలిగ్గా ఉంటుంది. బ‌రువు పెరిగే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయి. ప్ర‌తిరోజూ ఒక క‌ప్పు పండ్లు తింటే శ‌రీరానికి ఫైబ‌ర్లు అందుతాయి. 

పోష‌కాహారం :  తినే తిండి త‌క్కువ అయినా పోష‌కాలు ఉన్న‌వే తీసుకోవాలి. అందులో ఫ్యాట్ త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. దీనివ‌ల్ల క‌డుపు కూడా నిండుతుంది. క‌డుపు నిండుగా ఉంటే బ‌య‌ట ఫుడ్ తినాల‌ని కూడా అనిపించ‌దు.  

ఆహారాన్ని బాగా న‌మ‌లాలి : ఏం తిన్నా కూడా బాగా న‌మిలి మింగాలి. ఇలా తిన‌డం వ‌ల్ల ఊబ‌కాయం స‌మ‌స్య‌లు కూడా రావు. హ‌డావుడిగా ఆహారం న‌మ‌ల‌కూడ‌దు. లేటైనా ప‌ర్వాలేదు కాస్త నెమ్మ‌దిగా తింటే ఎక్కువ తిన్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఇలా కొన్నిరోజులు పాటిస్తే అల‌వాటుగా మారిపోతుంది. కొన్నిరోజుల‌కు బ‌రువు కూడా త‌గ్గుతారు. 

ఎక్కువ నీరు తాగాలి :  నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. అలా అని 5 లీ. మించ‌కుండా తాగితే స‌రిపోతుంది. వీటిలో క్యాల‌రీలు అనే ప‌ద‌మే ఉండ‌దు. అందుకే బ‌రువును త‌గ్గించి ఆక‌లిని త‌గ్గిస్తుంది. అంతేకాదు నీరు ఎక్కువ‌గా తాగితే చ‌ర్మం కూడా కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఆహారం త‌క్కువ తినాల‌నుకునేవారు భోజ‌నానికి అర‌గంట ముందు నీరు తాగితే స‌రిపోతుంది. logo