బరువు తగ్గండిలా!


Sun,October 28, 2018 07:04 AM

బరువు తగ్గడం కోసం డైటింగ్ చేస్తూ, మితంగా ఆహారాన్ని తీసుకుంటున్నారా? కాదంటే వాకింగ్, ఎక్సర్‌సైజ్‌లు, జిమ్‌కెళ్లి కండలు కరిగిస్తున్నారా? ఎలాంటి కసరత్తుల జోలికి వెళ్లకుండా బరువు తగ్గేందుకు ఈ చిట్కాలు ఓ సారి ప్రయత్నించండి.

-ఆహారం తీసుకునేటప్పుడు ఆదరాబాదరాగా తినొద్దు. మెల్లగా నమిలి తినండి. ఇలా చేయడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
-ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా పొట్ట నిండుతుంది. ఆకలి తగ్గడం వల్ల శరీరంలోకి తక్కువ కేలరీలు చేరతాయి.
-పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చాలా సేపటి వరకు ఆకలి కాదు. విస్కోస్ ఫైబర్ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. విస్కోస్ ఫైబర్ మొక్కల నుంచి లభించే ఆహారంలోనే ఉంటుంది. బీన్స్, ఓట్స్ సెరల్స్, ఆస్పరాగస్, నారింజ, అవిసె గింజల్లో ఈ పీచు పదార్థం ఉంటుంది.
-మంచి నీటిని తరుచుగా తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండుతుంది. 12 వారాలపాటు చేసిన అధ్యయనంలో తినడానికి ముందు నీరు తాగిన వారు 44 శాతం అధికంగా బరువు కోల్పోయినట్టు తేలింది.
-మితంగా ఆహారం తినే వారితో పోలిస్తే ఎక్కువ మొత్తంలో లాగించే వారు త్వరగా బరువు పెరుగుతారు. కొంచెం కొంచెం వడ్డించుకొని తినడం వల్ల శరీరంలోకి తక్కువ కేలరీలు చేరుతాయి.
-తినేటప్పుడు టీవీ చూడడం, కంప్యూటర్ గేమ్స్ ఆడడం లాంటి పనులు చేస్తే.. ఎంత తింటున్నామనే ఆలోచన ఉండదు. ఫలితంగా ఎక్కువ తినేస్తాం.
-నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్ లాంటి హార్మోన్లపై ప్రభావం పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆకలి పెరుగుతుంది. నిద్రలేమి, ఒత్తిడి వల్ల డయాబెటిస్, ఒబెసిటీ లాంటి అనేక వ్యాధులు చుట్టుముడుతాయి.
-తీపిగా ఉండే బేవరేజెస్ జోలికి వెళ్లొద్దు. సోడా లాంటి డ్రింక్స్ తాగడం వల్ల రోగాల ముప్పు పెరుగుతుంది. షుగరీ డ్రింక్స్ వల్ల శరీరంలోకి ఎక్కువ కేలరీలు చేరుతాయి. డ్రింక్స్ మానేయడం వల్ల దీర్ఘాకాలికంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.

6513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles