శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Apr 04, 2020 , 17:50:53

వైరస్‌ను అడ్డుకునే డ్రింక్‌ ఏదైనా ఉందా?

వైరస్‌ను అడ్డుకునే డ్రింక్‌ ఏదైనా ఉందా?

కాలం మారుతున్న‌కొద్ది వాతావార‌ణంలో అనేక మార్పులు సంభ‌విస్తుంటాయి. ఈ మార్పులు మనిషి శరీరంపై ప్రభావం చూపిస్తాయి.  జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గుతో వంటి చిన్న జబ్బులతో మనిషిని అశక్తున్ని చేస్తాయి. అస‌లే క‌రోనాతో స‌గం చ‌చ్చిన మ‌నుషుల్లా బ‌తుకున్నాం. ఇది కాద‌న్న‌ట్లుగా ఈ స‌మ‌యంలో ఇవి కూడా  వ‌స్తే ఇక అంతే.  అందుకే కాస్త జాగ్ర‌త్త‌ప‌డాలి. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. ఎలాంటి వైరస్‌ వచ్చినా తట్టుకునేటట్టు మన శరీరాన్ని తయారు చేసుకోవడం మన చేతిలోనే ఉంది. రోగనిరోదక శక్తినిచ్చే జ్యూస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యూస్‌ త‌యారీ

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, నిమ్మ‌కాయ రసం‌, కీర‌దోస‌, అల్లం వంటి ప‌దార్థాల‌న్నింటినీ స‌మ‌పాల‌ల్లో తీసుకోవాలి. వీటిని జ్యూస్‌లా చేసుకోవాలి. అందులో న‌ల్లఉప్పు లేదా చాట్‌మ‌సాల వేసుకొని తాగాలి. ప్ర‌తిరోజూ ఓ గ్లాస్ తాగ‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ వ్యాధుల‌ను మనదరి చేరనీయకుండా పోరాడ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకుంటుంది. 

నిమ్మ‌కాయ : ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. ఇందులో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. గుండె జబ్బుల నుంచి, గర్భ సమయంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు , కంటి సమస్యలు మరియు ఆఖరికి చర్మం ముడతలుపడటం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. విటమిన్ సి ను శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు, అందుకనే విటమిన్ సి లోపం చాలా సాధారణమైనది.

కీర‌దోస : ఇందులో విటమిన్స్, వాటర్ కంటెంట్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఐరన్ మరియు క్యాల్షియంలు అధికంగా ఉన్నాయి. శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడు తేమ‌గా ఉంచుతుంది. అంతేకాకుండా కీరదోసలో 95 శాతం నీటి శాతం మరియు ఆస్కార్బిక్ ఆమ్లం మరియు కెఫిక్ ఆమ్లం అనే రెండు సమ్మేళనాలు ఉన్నాయి. అధిక నీరు ఉన్నందున విషాన్ని బయటకు తీయడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇది బరువు తగ్గటానికి చాలా సహాయపడుతుంది. రొమ్ము కాన్సర్, అండాశయ కాన్సర్, గర్భాశయ కాన్సర్ మరియు ప్రోస్టేట్ కాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే లక్షణాలు కీర‌లో కలిగి ఉన్నాయి. 

పుదీన : ఘాటైన సువాసనతో పాటు.. కమ్మని రుచితో నోరూరించే పుదీనలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. దీన్ని డైట్ లో చేర్చుకుంటే.. రకరకాల సమస్యలకు గుడ్‌బై చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికే కాదు, చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది.  పుదీనా దీర్ఘకాలిక దగ్గు వల్ల కలిగే చికాకును కూడా తొలగిస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే వేడినీళ్లలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరిగించుకుని అందులో కొంచెం బెల్లం వేసుకుని పుదీనా టీ కూడా తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు.


logo