బుధవారం 28 అక్టోబర్ 2020
Health - Sep 27, 2020 , 11:40:57

'క‌ఫం' నుంచి విముక్తి పొంద‌డం ఎలా?

'క‌ఫం' నుంచి విముక్తి పొంద‌డం ఎలా?

వ‌ర్షాలు పడుతున్న‌ప్పుడు జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు వెంటాడుతూనే ఉంటాయి. జ‌లుబు నుంచి వ‌చ్చే క‌ఫం మ‌రింత వేధిస్తుంది. దీని కార‌ణంగా ద‌గ్గు మ‌రింత ఎక్కువ‌వుతుంది. అంతేకాదు గొంతులో ఏదో అడ్డు ప‌డుతున్న‌ట్లు ఉండ‌డంతో మాట్లాడ‌డానికి కూడా ఇబ్బంది ప‌డుతుంటారు. అ స‌మ‌స్య‌ల‌న్నింటికీ కార‌ణ‌మైన క‌ఫాన్ని వదిలించుకోలేమా? ఇంటి చిట్కాల‌తోనే క‌ఫం నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. అవేంటో తెలుసుకోండి.  

పైనాపిల్

పైనాపిల్‌ను నాలుగవ వంతు కప్పు నీటిలో క‌లుపాలి. ఈ ర‌సాన్ని రోజూ తీసుకుంటే క‌ఫం నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. పైనాపిల్ ముక్క‌లు తిన్నా స‌రిపోతుంది. రోజుకు ఒక‌సారి అయినా ఈ ర‌సం తాగితే మేలు. 

బెల్లం

ఉల్లిగ‌డ్డ‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి బెల్లం పొడిలో క‌లుపాలి. త‌ర్వాత ఈ రెండింటినీ క‌లిపి తినాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజూ కొంచెం కొంచెం తిన్నా ఫ‌లితం ఉంటుంది. ఊపిరితిత్తుల నుంచి  అవాంఛిత కణాలను బహిష్కరించ‌డానికి బెల్లం ఉప‌యోగ‌ప‌డుతుంది.  

నిమ్మరసం 

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మరసం వేసి బాగా క‌లుపాలి. ఇందులో కొంచెం తేనె క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని తాగాలి. ప్ర‌తిరోజూ ఒక గ్లాసు మిశ్ర‌మం తాగితే క‌ఫం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

ఉల్లిగ‌డ్డ‌

ఒక ఉల్లిగ‌డ్డ‌ను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్క‌ల‌ను చూర్ణం చేయాలి. ఇందులో అర టేబుల్‌స్పూన్ తేనె వేసి క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు రెండు, మూడుసార్లు తినాలి. ఇలా చేస్తే చాలు క‌ఫం ఉండ‌మ‌న్నా ఉండ‌దు.  

తేనె 

తేనె, మిరియాలు పొడిఈ రెండింటినీ బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌ర‌చూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే క‌ఫం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ప్రత్యామ్నాయంగా గోరువెచ్చని నీటిలో ఒక‌ టేబుల్ స్పూన్ తేనె వేసుకొని తాగినా స‌రిపోతుంది.  

పసుపు

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా క‌లుపాలి. రుచి కోసం కొంచె తేనె క‌లుపుకోవ‌చ్చు. ఈ ద్రావ‌ణాన్ని రోజూ తాగాలి. వీటి ద్వారా త్వ‌ర‌గా క‌ఫం నుంచి బ‌య‌ట ప‌డొచ్చు.  


logo