మీ శరీరానికి ఇ విటమిన్ అందాలంటే..


Mon,June 4, 2018 10:57 PM

రోజురోజుకు మతిమరుపు పెరుగుతుందా? జుట్టు రాలుతున్నట్టు, చర్మం ముడుతలు పడుతున్నట్టు అనిపిస్తుందా? అయితే
మీ శరీరంలో ఇంధనం లోపించిందన్నమాట. ఇంధనమంటే.. ఏదో కాదు.. విటమిన్ ఇ. మీ శరీరానికి సరిపడా ఇ విటమిన్ అందాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి.

* బ్రిటీష్ ఆరోగ్య నిపుణులు నిర్వహించిన పరిశోధనలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలో ఎక్కువగా విటమిన్ ఇ లోపం వారే ఉన్నారట.
* ఆలీవ్ ఆయిల్, బాదంపప్పు, సన్‌ఫ్లవర్ గింజలు, సన్‌ఫ్లవర్ నూనె, బ్రొకోలి, రొయ్యలు, చేపలు వంటి ఆహార పదార్థాల్లో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది.
* పాలకూరలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. దీంతో పాటే మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి.
* ఎముకలను దృఢంగా ఉంచడంలో విటమిన్ ఇ పాత్ర చాలా ఎక్కువ.
* శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ను మెరుగుపరిచే లక్షణాలు ఇ విటమిన్‌లో ఉంటాయి. అందుకే రోజుకు నాలుగైదు బాదం గింజలు తినాలి.
* చర్మం ముడుతలు పడడం, జుట్టు బలహీనంగా తయారవడం వంటి సమస్యలకు బాదంలో ఉండే విటమిన్ ఇ చెక్ పెడుతుంది.
* వెజిటెబుల్ ఆయిల్స్‌లో ఇ విటమిన్ కావల్సినంత దొరుకుతుంది. పొద్దు తిరుగుడు, ఆలీవ్ కనోలా వంటి ఆకుకూరలు రెగ్యులర్‌గా తినండి.
* శరీరంలో కావాల్సినంత ఇ విటమిన్ ఉంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీ రాడికల్స్ కణాలను నశింపచేస్తాయి.
* విటమిన్ ఇ జీవక్రియలు సక్రమంగా జరుగడానికి దోహదపడుతుంది.

4485

More News

VIRAL NEWS