శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Sep 11, 2020 , 20:22:57

ఆరోగ్యంగా ఉండేందుకు 5 మార్గాలు

ఆరోగ్యంగా ఉండేందుకు 5 మార్గాలు

లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో బ‌ద్ద‌కం ఏర్ప‌డింది. ఇది వ‌ర‌కు ఇంటి ప‌ని చేసుకొని పిల్ల‌ల‌ను స్కూల్‌లో దింపి, త‌ర్వాత ఆఫీసుకు వెళ్లేవాళ్లు. త‌ర్వాత ఎప్పుడో రాత్రికి ఇంటికి వ‌స్తారు. ఇంత బిజీగా ఉండేవాళ్లు ఒక్క‌సారి ఇంటికే ప‌రిమిత‌మ‌య్యేస‌రికి బ‌ద్ద‌కం ఏర్ప‌డింది. టైంకి తిన‌క స్టామినాను కోల్పోతున్నారు. ఇలా ఎన్నిరోజులో తెలియ‌దు. అందుకే ఇంట్లోనే ఉంటూ ఎన‌ర్జీగా, స్టామినా క‌లిగుండాలంటే ఈ ఐదు మార్గాల‌ను ఫాలో అవ్వాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

స‌మ‌యానికి తిండి తినాలి :

ఆఫీసుకు వెళ్లేట‌ప్పుడు స‌మ‌యానికి ఎలా అయితే భోజ‌నం చేసేవాళ్లో ఇంట్లో కూడా అలానే అల‌వాటు చేసుకోవాలి. రోజూ మార్చ‌కుండా ఒకే టైంని సెట్ చేసుకోండి. ఇలా తిన‌డం వ‌ల్ల శ‌క్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీంతో శ‌రీరం స్థిర‌ప‌డుతుంది. ఇది హార్మోన్ల‌ను స‌మ‌తుల్యం చేసి శ‌క్తివంతంగా ఉంచుతుంది.   

పోష‌క విలువులున్న ఆహారం తినాలి :

లాక్‌డౌన్‌లో జ‌రిగిన మంచి విషయం ఏమిటంటే..ఇంట్లో వండిన ఆహారాన్ని తిన‌డ‌మే. ఇంట్లో పిజ్జా, బ‌ర్గ‌ర్‌లు త‌యారు చేసుకున్నా అది ఫ్రెష్‌వి కావ‌డం వ‌ల్ల మ‌రేం ప‌ర్వాలేదు. తినే ఆహారంలో పోష‌కాలు ఉండేలా చేసుకోవాలి. ఆహారాన్ని పులియ‌బెట్టి తింటే పోష‌కాల‌ను శోషించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం తిన‌డం వ‌ల్ల ఎన‌ర్జీని కోల్పోతారు.  

నీరు ఎక్కువ‌గా తాగాలి :

వాతావ‌ర‌ణం వేడిగా ఉన్నా చ‌ల్ల‌గా ఉన్నా నీటిని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉండాలి. నీటితోపాటు పండ్ల ర‌సాలు కూడా తాగుతూ ఉండాలి. జ్యూస్‌లో చ‌క్కెర శాతం త‌క్కువ‌గా ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. చక్కెర లేకుండా ఫ్రెష్ లెమ‌న్ వాట‌ర్‌, కొబ్బరి నీరు,  జల్జీరా వంటి వాటిని తీసుకుంటూ ఉంటే మంచిది. దీంతోపాటు బేల్ షెర్బ‌త్ కూడా తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇవి తాగ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేట్‌కు గుర‌వ‌కుండా ఉంటుంది.  

డ్రైఫ్రూట్స్ తినాలి :

ఎంత మంచి ఆహారం తిన్న‌ప్ప‌టికీ ప్ర‌తిరోజూ డ్రైఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. బాదం, ఎండు ఖ‌ర్జూరం వంటి వాటిని నీటిలో నాన‌బెట్టుకొని తింటే మంచిది. రోజుకు 15-20 బాదం ప‌ప్పులు తినాలి. అలాగే ఒక‌టైనా వాల్‌న‌ట్ తినాలి. వీటిలో ఆరోగ్య‌క‌ర‌మైన గింజ‌లు, ఫైబ‌ర్‌, ప్రోటీలు ఉంటాయి. ఇవి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి తోడ్ప‌డుతాయి. 

వ్యాయాయం చేయాలి :

వ్యాయామం చేయ‌డం అల‌వాటు ఉండి ఆపేసిన వారు మ‌ర‌లా ప్రారంభించాలి. లాక్‌డౌన్‌లో ఎక్క‌డున్నా ప్ర‌తిరోజూ వ్యాయామం చేసేలా చూసుకోవాలి. స్టార్ట్ చేశాం క‌దా అని ఒకేసారి అధిక మొత్తంలో వ్యాయామం చేయ‌కుండా కొంచెం కొంచెం స‌మ‌యాన్నిపెంచుకుంటూ  ఉండాలి. త‌ర్వాత త‌దుప‌రి స్థాయికి వెళ్లొచ్చు.  

ఈ ప‌నులు చేస్తుంటే చాలు. లాక్‌డౌన్ ఉన్నా లేకున్నా ఫిట్‌గా ఉండ‌డంతోపాటు ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఎక్క‌డికి వెళ్లినా క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాలి. 


logo