శనివారం 30 మే 2020
Health - Mar 31, 2020 , 13:48:00

నిజాముద్దీన్ లో ఏం జరిగింది?

నిజాముద్దీన్ లో ఏం జరిగింది?

నిజాముద్దీన్ అనేది ఓ సూఫీ మతపరమైన సంస్థ. తరచుగా మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఈ సారి అలాంటి ఓ కార్యక్రమం కరోనా భగ్గుమని దావానలంలా వ్యాప్తి చెందడానికి దోహదం చేసింది. అనేకమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. అసలు ఇంతకూ అక్కడ ఏం జరిగింది? పర్యవసనాలు ఎలా ఉన్నాయి? 

ఒకసారి చూద్దాం..

1. కార్యక్రమం జరిగిన మర్కజ్ మసీదు భవన సలముదాయం మిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌ను ఆనుకునే ఉంటుంది. సుప్రసిద్ధ ఖ్వాజా నిజాముద్దీనిన్ ఔలియా క్షేత్రానికి పక్కన ఉంటుంది. మసీదు పక్కనే 25 వేల జనాభా కలిగిన బస్తీ ఉంటుంది.

2. మర్కజ్‌లో మార్చి 1-15 తేదీల మధ్య జరిగిన తబ్లిఘ్ జమాత్ అనే కార్యక్రమానికి  భారత్‌తోపాటు ఇండోనేసియా, మలేసియా తదితర దేశాలకు చెందిన 2,000 మంది ప్రతినిధులు నిజాముద్దీన్‌లో హాజరయ్యారు.

3. ఈ కార్యక్రమానికి హాజరైనవారు ఏడుగురు హైదరాబాద్‌లో కరోనాతో మరణించారు. మరొక వ్యక్తి శ్రీనగర్ లో మరణించారు.

4. ప్రతినిధుల్లో కనీసం 37 మందికి కరోనా సోకింది. ఆదివారం పాజిటివ్ వచ్చిన 24 మంది అందులో భాగమే. 

5. కార్యక్రమానికి హాజరైనవారిని సోమవారం రాత్రి లోక్‌నాయక్ హాస్పిటల్ కు తరలించి 100 మందికి కరోనా పరీక్షలు జరిపారు.

6. కార్యక్రమానికి హాజరైన 2,000 మంది మసీదులోని ఆరు అ్ంతస్థుల భవనంలో బస చేశారు. అందులో 250 మందికి పైగా విదేశీయులు. అంతా  కలిసి గడిపారు. కలిసి భోంచేశారు.

7. మసీదు చుట్టూ గల బస్తీని వైద్యబృందాలు ఆదివారం నుంచి దిగ్బంధించి ఇల్లిల్లు గాలిస్తున్నాయి.

8. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో తెలంగాణ, కర్నాటక, ఒడిశా, బీహార్, జమ్ముకశ్మీర్ తదితర రాష్ట్రాలకు చెందివారు ఉన్నారు. 

9. జనతా కర్ఫ్యూ జరిగిన మార్చి 22న పోలీసు బృందాంలు మసీదు దగ్గర నిలబడి సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారు. ఆ తేదీ నుంచి బయటివారిని ఎవరినీ లోపలకు అనుమతించలేదు.

10. మసీదు భవనసముదాయంలో తనిఖీలు, పరీక్షలు జరపడంలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆరోగ్య విభాగం అధికారులకు పోలీసులు సహకరిస్తున్నారని దక్షిణ ఢిల్లీ రేంజ్ పోలీసు జాయింట్ కమిషనర్ దేవేశ్ శ్రీవాస్తవ తెలిపారు.   


logo