బ‌రువు త‌గ్గాలంటే రోజుకు ఎన్ని గ్రాముల ప్రోటీన్లు అవ‌స‌ర‌మో తెలుసా..?

Sat,March 23, 2019 12:20 PM

అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే ఎవ‌రైనా సరే.. ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాల‌ను తీసుకోవాల్సిందే. ఎందుకంటే.. నిత్యం త‌గినంత ప్రోటీన్ శ‌రీరానికి ల‌భిస్తే దాంతో శరీరంలో జీవ‌క్రియ‌ల‌న్నీ సాఫీగా జ‌రుగుతాయి. ఫ‌లితంగా మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ప్రోటీన్లు ఉన్న ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి. అయితే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు నిత్యం త‌గిన మోతాదులో శ‌రీరానికి ప్రోటీన్ అందేలా చూసుకోవాలి. మ‌రి మ‌న శ‌రీరానికి నిత్యం ఎంత ప్రోటీన్ అయితే స‌రిపోతుంది..? అంటే...


మ‌న శ‌రీరం ప్రోటీన్ల‌ను కొవ్వులాగా నిల్వ చేయ‌దు. అందుక‌ని మ‌నం నిత్యం మ‌న‌కు త‌గిన మోతాదులో ప్రోటీన్ల‌ను తీసుకోవాలి. దీని వ‌ల్ల కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి. చ‌ర్మం, ఇత‌ర అవ‌య‌వాలకు పోష‌ణ ల‌భిస్తుంది. క‌ణ‌జాలం మ‌ర‌మ్మ‌త్తు అవుతుంది. కొత్త క‌ణాలు నిర్మాణ‌మ‌వుతాయి. కాగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ వైద్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం.. స‌గ‌టు వ్య‌క్తికి ఒక కిలో బ‌రువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. అంటే.. సుమారుగా 70 కిలోల బ‌రువుండే ఓ వ్య‌క్తి నిత్యం 70 x 0.8 = 56 గ్రాముల వ‌ర‌కు ప్రోటీన్ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక వ్యాయామం చేసేవారు, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా ఉండే వారు ఇంకాస్త ఎక్కువే ప్రోటీన్ల‌ను తీసుకోవాలి. వారు త‌మ శ‌రీరంలో ఒక కిలో బ‌రువుకు సుమారుగా 1.4 నుంచి 2 గ్రాముల వ‌ర‌కు ప్రోటీన్ల‌ను తీసుకోవాలి. అంటే.. సుమారుగా 70 కిలోల బ‌రువు ఉండే వ్యాయామం చేసే ఒక వ్య‌క్తి నిత్యం 98 నుంచి 140 గ్రాముల వ‌ర‌కు ప్రోటీన్ల‌ను తీసుకోవాలి. వ్యాయామం చేసే ముందు లేదా చేసిన త‌రువాత క‌చ్చితంగా ప్రోటీన్లు ఉన్న ఆహారాల‌ను తినాలి. దీంతో కండ‌రాలు మ‌ర‌మ్మ‌త్తు అవుతాయి. శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. ఇక ప్రోటీన్ల విష‌యానికి వ‌స్తే బోన్‌లెస్, స్కిన్ లెస్ చికెన్‌, మ‌ట‌న్‌, ప్రాన్స్‌.. వంటివి నిత్యం తిన‌వ‌చ్చు. కానీ వాటి ద్వారా కొవ్వు కూడా అధికంగా ల‌భిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే న‌ట్స్‌, బీన్స్ త‌దిత‌ర వెజ్ ఆహారాల‌ను తీసుకుంటే నిత్యం మ‌న‌కు కావ‌ల్సిన మోతాదులో ప్రోటీన్ల‌ను పొంద‌వ‌చ్చు. దీంతో శ‌రీరం దృఢంగా ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

2189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles