రోజూ ఎన్ని కప్పుల గ్రీన్ టీ తాగితే మంచిదో తెలుసా..?


Tue,April 3, 2018 03:54 PM

ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన డ్రింక్ ఏదైనా ఉందంటే అది గ్రీన్ టీ అని ఇట్టే చెప్పవచ్చు. ఎందుకంటే దాంట్లో ఏ ఇతర ఆహారం, డ్రింక్‌లో లేని విధంగా పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి మనల్ని అనేక రోగాల నుంచి రక్షిస్తాయి. అందుకే గ్రీన్ టీని ఇప్పుడు చాలా మంది తమ నిత్య జీవితంలో భాగం చేసుకుంటున్నారు. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో లాభాలున్నప్పటికీ రోజూ తగినంత మోతాదులోనే దాన్ని తాగాల్సి ఉంటుంది. మోతాదుకు మించరాదు. మించితే ఆరోగ్యం కలగకపోగా, అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. మరి ఎవరైనా రోజుకు ఎన్ని కప్పుల వరకు గ్రీన్ తాగవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

గ్రీన్ టీ తాగడం వల్ల పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు మనకు అందుతాయి. ఇవి మనకు రోజుకు 320 మిల్లీగ్రాముల మోతాదులో సరిపోతాయి. అలాగే గ్రీన్ టీ వల్ల మనకు కెఫీన్ కూడా బాగానే లభిస్తుంది. ఒక కప్పు గ్రీన్ టీ తాగితే 25 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ అందుతుంది. కాగా కెఫీన్ రోజువారీ పరిమితి 400 మిల్లీగ్రాములుగా ఉంది. కనుక పాలిఫినాల్స్, కెఫీన్ ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే రెండూ తగినంత మోతాదులోనే మనకు లభించాలంటే.. దాదాపుగా మూడు కప్పుల వరకు గ్రీన్ టీని మనం రోజూ తాగవచ్చు. కానీ అంతకు మాత్రం మోతాదు మించరాదు. మించితే ఆరోగ్యం కలగకపోగా, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే గ్రీన్‌టీని మూడు కప్పుల వరకు తాగాలనుకునే వారు కాఫీ, టీలను బాగా తగ్గించడం బెటర్. ఎందుకంటే వాటిల్లోనూ కెఫీన్ ఉంటుంది. వాటి ద్వారా వచ్చే కెఫీన్, గ్రీన్ టీ ద్వారా వచ్చే కెఫీన్ రెండూ కలిపి మళ్లీ రోజు వారీ లిమిట్ (400 మిల్లీ గ్రాములు)ను మించిపోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ లిమిట్ లోపు ఉండేలా చూసుకుంటూ గ్రీన్ టీని తాగవచ్చు.

3316

More News

VIRAL NEWS