గురువారం 04 మార్చి 2021
Health - Jan 23, 2021 , 21:29:19

ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?

ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?

హైద‌రాబాద్ : కరోనా.. 2020లో వచ్చిన మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి వెన్నులో సంవత్సరమంతా వణుకు పుట్టించేలా చేసింది. ఎన్నో రూపాలు మార్చుకుంటూ రకరకాల లక్షణాలను తెచ్చుకుంటూ అతలాకుతలం చేసింది. మొత్తానికి సార్స్(SARS) వ్యాక్సిన్ రెడీ చేసి కోవిడ్-2 అంతమొందించే ఏర్పాట్లు చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మొదట వ్యాక్సిన్ డెవలప్ చేసిన కూడా ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కొట్టేసింది. మరి ఇప్పుడు మరో వ్యాక్సిన్ వచ్చి కరోనావైరస్ తో పోరాడేందుకు ఇమ్యూనిటీ ఇస్తానంటోంది. నిజంగా కరోనా వ్యాక్సిన్ వల్ల ఇమ్మూనిటీ అందుతుందా.. అలా వచ్చే ఇమ్యూనిటీ ఎంతకాలం? అసలు ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీని అందిస్తుంది అనే విషయాలపై అందరికీ అనుమానాలే.. కాబట్టి వివరంగా తెలుసుకుందాం పదండి.. 

1. మోడర్నా వ్యాక్సిన్

నోవల్ కరోనా వైరస్ తో పోరాడేందుకు రెడీ అయిన వ్యాక్సిన్ లలో మోడర్నా ఎమ్ఆర్ఎన్ఏ ఒకటి. 'శరీరంలో ఉండే యాంటీబాడీలు ఈ వ్యాక్సిన్ వల్ల నిదానంగా తగ్గుతాయి. దీని వల్ల దాదాపు రెండేళ్ల వరకూ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఉంటుంది' అని  సీఈఓ స్టీఫెన్ బన్సెల్ చెబుతున్నారు.

2. కొవీషీల్డ్ వ్యాక్సిన్

ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను సీరం ఇన్ స్టిట్యూట్ ఆప్ ఇండియా (కోవీషీల్డ్) రీసెంట్ గా ఇండియాలో ఎమర్జెన్సీగా చేసుకోవచ్చని అప్రూవల్ దక్కించుకుంది. ఈ వ్యాక్సిన్ కు సహజంగానే ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సీటీ ప్రొఫెసర్ సారా గిల్బెర్ట్ అంటున్నారు. 

3.ఫైజర్-బయోఎన్టెక్ వ్యాక్సిన్

ఆమోదం పొందిన కరోనా వైరస్ వ్యాక్సిన్ లలో ఫైజర్-బయోఎన్టెక్ మొదటిది. యూకే, యూఎస్ లలో 85రోజుల ట్రయల్ తర్వాత దీనికి ఆమోదం అందింది. కాబట్టి దీని ద్వారా  కోవిడ్-2 నుంచి సహజమైన ప్రొటెక్షన్ దొరుకుతుందని తేలింది. 

4. కొవాగ్జిన్ వ్యాక్సిన్

భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ రీసెంట్ గా ఇండియాలో ఆథరైజేషన్ దక్కించుకుంది. కాకపోతే ట్రయల్స్ లో చాలా కాంట్రవర్సీ అయింది. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే యాంటీబాడీలు దాదాపు 6నుంచి 12 నెలల వరకూ సజీవంగా ఉంటాయి. 

5. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్

ఫార్మాసూటిక్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ స్టడీలో ఫేజ్ 1, ఫేజ్ 2లు పూర్తించేసుకుంది. మొదటి డోస్ తర్వాత 29 రోజుల పాటు యాంటీబాడీలు ఉంటాయని తెలియగా, రెండో డోస్ 98 శాతం పార్టిసిపెంట్స్ లో సక్సెస్ అయింది. మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ చేయాల్సి ఉంది. 

6. స్పుత్నిక్ వ్యాక్సిన్

నోవల్ కరోనావైరస్ తో పోరాడేందుకు రెడీ అయిన మొట్టమొదటి వ్యాక్సిన్ స్పుత్నిక్. అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకుని రష్యాలో మిలియన్లలో యూసేజ్ కు రెడీ అయింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రెండేళ్ల పాటు ఇమ్యూనిటీ ఇస్తుందని రీసెంట్ రిపోర్ట్ లో గమాలెయా ఇన్‌స్టిట్యూట్ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్  చెప్పారు. మనిషి ఆరోగ్య పరిస్థితిని బట్టి అంతకంటే ఎక్కువ ప్రొటెక్షన్ కూడా ఇచ్చే అవకాశాలున్నాయని గింట్స్ బర్గ్ అంటున్నారు.

VIDEOS

logo