మంగళవారం 14 జూలై 2020
Health - May 20, 2020 , 17:14:22

చురుగ్గా ఉండాలంటే ఇలా చేయండి?

 చురుగ్గా ఉండాలంటే ఇలా చేయండి?

కొంతమంది ఎప్పుడు చూసినా నవ్వుతూ యాక్టివ్‌గా ఉంటారు. మరికొంతమంది దిగాలుగా కూర్చొని ఉంటారు. వీరు ఏ పని చేయాలన్నా బద్దకిస్తారు. దీనికి కారణం ఏంటి? వీరు కూడా అందరిలా యాక్టివ్‌గా ఉండాలంటే ఏం చేయాలి. 

ఏం చేయాలి?

- కొన్నిసార్లు ఆకలిగా ఉన్నకూడా యాక్టివ్‌గా ఉండలేరు. ఆ సమయంలో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సరే అని కడుపునిండా తిన్నా ఏదో పోయినట్టుగానే ఉంటారు.  

- దీనికి కారణం పోషకాల లోపమే. అందుకే ఆహారం తీసుకునేటప్పుడే పోషకాలు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, చేపనూనె, అవిసెలు వంటి హెల్తీ ఫ్యాట్స్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

- అయితే ఆకలిగా ఉన్నప్పుడు ఒకేసారి కడుపునిండా అన్నం తినేయకూడదు. కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఎలా అంటే.. మూడు గంటలకు ఒకసారి తీసుకోవడం మంచిది. అప్పుడే సులువుగా అరుగుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. 

- యోగాలు, వ్యాయాలు చేసే వారు ముఖ్యంగా పోషక విలువలున్న ఆహారాన్నే తీసుకోవాలి. ఆహారంలో క్యాలరీలు, ప్రోటీన్లు మెండుగా ఉండడంవల్ల శరీరం దృఢంగా ఉంటుంది.

- శరీరాన్ని ఎంత కష్టపెడుతామో అంత విశ్రాంతినివ్వాలి. లేదంటే అనర్దమే. 

-శరీరంలోని కొవ్వు కరగాలంటే రోజూ తగినంత ప్రోటీన్‌ ఫుడ్‌ తీసుకోవాలి. అలాగే క్యాలరీలు తక్కువ ఉండేలా చూసుకోవాలి. 

- ఈ చిట్కాలు పాటించండి అందరికంటే ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి.logo