శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jun 03, 2020 , 15:34:37

వేడినీటి స్నానం మంచిదేనా?

వేడినీటి స్నానం మంచిదేనా?

చలికాలం.. వెచ్చవెచ్చగా వేడినీటి స్నానం చేద్దామని కోరుకోని వారుండరు. చాలామంది మరిగే నీళ్లను ఒంటిమీద పోసుకొని హ్యాపీగా ఫీలవుతుంటారు. కానీ, వేసవిలో మండిపోయే ఎండలు. అలాంటప్పుడు కూల్ వాటర్‌ ఎక్కడ దొరుకుతాయా.. తలమీద పోసుకుందామా అని ఆలోచిస్తుంటారు. అయితే.. చల్లటి నీరు, వేడి నీరు.. ఈ రెండింట్లో స్నానానికి ఏవి మంచిదో  ఇప్పుడు తెలుసుకుందాం.

* ఏ కాలంలో అయినా వేడి నీటికంటే చల్లటి నీటితోనే స్నానం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. వేడి నీటితో స్నానం చేస్తే బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. దీనివల్ల నిద్ర వచ్చినట్లు మత్తుగా ఉంటుంది. దీంతో రోజంతా అలసటగా ఉంటుంది.

* చల్లటి నీటితో స్నానం చేస్తే ముఖంపై చిన్న చిన్న రంధ్రాలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు నిపుణులు. ఈ కారణంగా చాలామంది ఉదయాన్నే ఐస్‌ మాస్క్ వేసుకుంటారు. అంటే ఓ బౌల్‌లో చల్లని నీటిని తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసి ముఖాన్ని కాసేపు ఆ బౌల్‌లో ఉంచాలి. దీనివల్ల ముఖంపై రంధ్రాలు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా మారుతుంది. అంతేకాదు అందంగానూ కనిపిస్తారు.

* సాయంత్రం వేళ స్నానానికి వేడి నీటిని ఉపయోగించడం మంచిది. దీనివల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. హాయిగా నిద్రపడుతుంది. అలసిన కండరాలు కూడా బాగా రిలాక్స్ అవుతాయి. అయితే బాగా మరిగిన నీటితో స్నానం చేయకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.

* మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడే వారు చన్నీటితో స్నానం చేస్తే సమస్య ఇంకా ఎక్కువవుతుంది. తలనొప్పి, తలపట్టేసినట్లు ఉండడం లాంటి సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారు ఉదయం గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.


logo