సోమవారం 25 మే 2020
Health - May 22, 2020 , 18:17:40

వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!

వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!

హైదరాబాద్‌: రోజురోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. గత నాలుగైదు రోజులుగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో గురువారం 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జనం వడదెబ్బకి గురై చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు. మరి ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దామా..? 

  • సహజంగా ప్రతిరోజు 7-8 లీటర్ల నీళ్లు తాగాలి.
  • నీరసంగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
  • ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచి నీళ్ల బాటిల్, తలకు క్యాప్‌ ధరించాలి. 
  • రోజూ క్రమం తప్పకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, చల్ల, రాగిజావ తీసుకోవాలి.
  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదు. 
  • వేసవిలో ఉక్కపోత కారణంగా శరీరంపై చెమట పొక్కులు వస్తాయి. కాబట్టి జీన్స్‌ లాంటి దుస్తులు కాకుండా తెల్లని కాటన్ వస్త్రాలు ధరించాలి. 
  • బిర్యానీలు, మాంసాహారం, శరీరానికి వేడిచేసే మసాల దినుసులు, కారం ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, వేపుడు పదార్ధాలు తినకూడదు. 
  • వేడిచేసిన వారు రోజూ మూడు టీ స్పూన్‌ల సబ్జా గింజలు నానబెట్టుకుని తినాలి. 
  • ఉదయాన్నే కలబంద గుజ్జును సన్నగా తరిగి తినడంవల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది.


logo