చల్లని లేదా వేడి పాలు.. రెండింటిలో వేటిని తాగితే మంచిదో తెలుసా..?


Wed,January 31, 2018 11:12 AM

పాలు మనకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయని అందరికీ తెలిసిందే. పాలను రోజూ తాగితే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. పాలలో సమృద్ధిగా ఉండే కాల్షియం, విటమిన్ డి, పొటాషియం మన శరీరానికి ఎంతగానో అవసరం. ఇవి పలు అనారోగ్య సమస్యలను రాకుండా చేస్తాయి. అయితే పాలను తాగే విషయంలో చాలా మందికి వచ్చే సందేహం ఒకటుంది. అదేమిటంటే.. పాలను వేడిగా తాగాలా..? లేదంటే చల్లగా ఉన్నప్పుడు తాగితే మంచిదా..? ఎలా తాగాలి..? అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మరి దీనికి వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!

పాలను వేడిగా లేదా చల్లగా ఎలా తాగినా మనకు మంచిదే. కాకపోతే చలికాలంలో పాలను వేడిగా తాగితేనే మంచిది. ఎందుకంటే ఇది మ్యూకస్‌ను కరిగిస్తుంది. కఫం పేరుకుపోకుండా చూస్తుంది. అదే వేసవిలో అయితే పాలను వేడి చేసి చల్లార్చాక తాగితే మంచిది. దీంతో ఆయుర్వేద ప్రకారం పిత్త సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఎవరైనా తమ ఆరోగ్య స్థితిని బట్టి చల్లని లేదా వేడి పాలను తాగవచ్చు. కానీ పాలను బాగా మరిగించాల్సిన పనిలేదు. కొంత వేడి చేసుకుని తాగితే చాలు. పాలను వేడి చేయడం వల్ల వాటిల్లో ఉండే కొన్ని పోషకాలు ఎలాగూ పోతాయి. కనుక అతిగా మరిగించకుండా కొద్దిగా వేడి చేసిన పాలను తాగాల్సి ఉంటుంది.

6558

More News

VIRAL NEWS